Srinivasa Mangapuram | ఓటీటీలోకి ‘శ్రీనివాస మంగపురం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Srinivasa Mangapuram | తెలుగు సినీ పరిశ్రమలోకి సూపర్ స్టార్ కృష్ణ మూడో తరానికి చెందిన వారసుడిగా ఘనంగా అడుగుపెట్టారు జయకృష్ణ ఘట్టమనేని. దివంగత నటుడు రమేష్ బాబు తనయుడైన జయకృష్ణ హీరోగా, బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ నూతన నాయికగా టాలీవుడ్‌కు పరిచయమైన తాజా చిత్రం 'శ్రీనివాస మంగాపురం'.
Srinivasa Mangapuram | తెలుగు సినీ పరిశ్రమలోకి సూపర్ స్టార్ కృష్ణ మూడో తరానికి చెందిన వారసుడిగా ఘనంగా అడుగుపెట్టారు జయకృష్ణ ఘట్టమనేని. దివంగత నటుడు రమేష్ బాబు తనయుడైన జయకృష్ణ హీరోగా, బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ నూతన నాయికగా టాలీవుడ్‌కు పరిచయమైన తాజా చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. వైవిధ్యమైన చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ రొమాంటిక్ యాక్షన్ అండ్ రస్టిక్ డ్రామా ఇటీవలే థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అయితే ఈ సినిమా వచ్చి 20 రోజులు కూడా కాకముందే సినిమా ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను పంచుకున్నారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ద్వారా రేపటి నుంచి (ఆగస్టు 20 నుంచి) స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు మోహన్ బాబు అత్యంత కీలకమైన పాత్రలో నటించగా, కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించగా, ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ సంస్థ సమర్పించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తిరుపతి నేపథ్యంతో ఈ కథ సాగుతుంది. నగరంలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను (జయకృష్ణ) .. అక్కడి పవర్ ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి (శ్యామ్) గారాల కూతురు మంగ (రాషా తడాని)ని మొదటి చూపులోనే ఇష్టపడతాడు. ఆమెకు చేరువయ్యే ప్రయత్నంలో ఉండగా, మంగ జీవితానికి సంబంధించి ఒక షాకింగ్ నిజం తెరపైకి వస్తుంది. అసలు ఆ రహస్యాన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? శ్రీను నేపథ్యం ఏమిటి? మంగతో అతనికి ఉన్న పాత సంబంధం ఏంటి? బళ్లారి ప్రాంతానికి చెందిన వెంకటప్పయ్య (మోహన్ బాబు), లక్ష్మీపతి (అజయ్)ల మధ్య జరిగిన వివాదాలు ఈ కథను ఎలాంటి మలుపులు తిప్పాయి? చివరికి శ్రీను తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అనేదే ఈ చిత్ర అసలు కథ.
The MOST INTENSE LOVE STORY of the Season is Coming Home ❤️🔥#SrinivasaMangapuram Streaming on @PrimeVideoIN from Tomorrow, August 20th 🔥#JaiKrishnaGhattamaneni #RashaThadani @themohanbabu @DirAjayBhupathi @AshwiniDuttCh @gvprakash @gemini_kiran @sahisuresh @gullapallikumar… pic.twitter.com/gAmL53yUru
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 19, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

