Vemulavada : బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తమ చిన్న కుమారుడు ప్రణయ్ వివాహానికి పార్టీ నాయకులను వరసపెట్టి ఆహ్వానిస్తున్నారు. ఆదివారం బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు-సునీల దంపతులకు వినోద్ కుమార్ సతీమణి మాధవితో కలిసి పెండ్లి పత్రికను అందజేశారు.
వినోద్ కుమార్, మాధవి దంపతుల రెండో కుమారుడైన ప్రణయ్ వివాహం డాక్టర్ రీతికతో జూన్ 25న గురువారం జరుగనుంది. ఉదయం 7:41 గంటలకు జన్వాడాలోని కే. కన్వెన్షన్ లో ప్రణయ్, రీతిక దాంపత్య జీవితంలో అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు వినోద్ కుమార్ మాధవి దంపతులు ప్రణయ్ పెండ్లి పత్రిక అందించారు.