Oil Prices hike: పెరిగిన పెట్రో ధరలతోనే కొవిడ్ వ్యాక్సిన్లు : కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి
Oil Prices hike : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు పన్నులే కారణమని సెలవిచ్చిన కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి.. ఈ పెంచిన ధరలతో...

గువాహటి : (Oil Prices hike) అధికారంలో ఉండి మంత్రులుగా వెలగబెడుతున్న చాలా మంది నోటికి ఏది వస్తే అది మాట్లాడి పరువు తీసుకుంటున్నారు. ఇటీవల మహిళలు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతున్నారని, అద్దె గర్భం కోరుకుంటున్నారని కర్ణాటకకు చెందిన ఓ మంత్రి చెప్పగా.. వ్యర్ధ ప్రసంగాలు చేయడంలో కేంద్ర మంత్రిగా ఉన్న తానేం తక్కువ తినలేదని నిరూపించుకున్నారు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు పన్నులే కారణమని సెలవిచ్చిన కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి.. ఈ పెంచిన ధరలతో దేశ ప్రజలకు కొవిడ్ టీకాలు ఉచితంగా ఇస్తున్నామని తన అవివేకాన్ని బయటపెట్టుకున్నారు. కరోనా డోసు కోసం ప్రజల నుంచి ప్రభుత్వం డబ్బు వసూలు చేయడం లేదన్న విషయం తెలియదా? అంటూ సభకు హాజరైన వారిని ప్రశ్నించారు కూడా. అంతటితో ఆగకుండా హిమాలయన్ కంపెనీ తాగునీటి ధర లీటర్ పెట్రోల్ కంటే ఎక్కువే అని వ్యాఖ్యానించారు. ఈ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
ఈ నెల 9 న అసోంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన కేంద్ర సహాయ మంత్రి ‘చమురు ధరలు ఎక్కువగా లేవు. పన్నులు అందులో చేర్చారు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు టీకాను ఉచితంగా పొందాంటే దాదాపు రూ.1,200 కోట్లు ఖర్చవుతాయి. ఇంత మొత్తం డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది? చమురుపై అందే పన్నులతోనే టీకాలు అందిస్తున్నాం. అయినా, చమురు ధరలను మా మంత్రిత్వ శాఖ చూడదు. అంతెందుకు, హిమాలయ వాటర్ బాటిల్ ధర తక్కువ ఉన్నదా? పెట్రోల్ కన్నా ఖరీదైనదిగా ఉన్నా కొని తాగడం లేదా? అని చెప్పారు.
ఇలాఉండగా, అసోం బీజేపీ శాఖ అధ్యక్షుడు భాబేష్ కాలితా కూడా తనేం తక్కుత తినలేదంటూ ఉచిత సలహాలు ప్రజలకు ఇచ్చాడు. పెట్రో ధరలు పెరిగిపోతున్నందున.. ప్రజలు వాహనాలపై ముగ్గురు ముగ్గురు వెళ్లాలని, లేదంటే నడిచిపోవడం అలవాటు చేసుకోవాలన్నారు.
ఇవి కూడా చదవండి..
పెద్ద మొత్తం డాలర్లతో అష్రఫ్ ఘనీ పరారీ.. ఆధారాలు ఉన్నాయంటున్న సెక్యూరిటీ చీఫ్
మృత్యువు ముంగిట.. తండ్రిని కలిసిన కొడుకు
లఖింపూర్ మృతులకు నివాళులు.. సీతాపూర్‌లో ప్రియాంక అడ్డగింత
శ్రీనగర్‌లో కశ్మీరీ పండిట్ల ప్రదర్శన.. ముస్లింల మద్దతు
స్పేస్ సూట్ ధరించకుండా అంతరిక్షంలోకి వ్యోమగాములు
నీటి శుద్ధి కోసం ‘హైడ్రోజెట్ ట్యాబ్లెట్’.. సిద్ధం చేసిన అమెరికా శాస్త్రవేత్తలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

