చరిత్రలో ఈరోజు : ముచ్చటగా మూడోసారి ప్రధానిగా వాజపేయి
చరిత్రలో ఈరోజు : కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించి 1999 లో సరిగ్గా ఇదే రోజున బీజేపీకి చెందిన అటల్ బిహారీ వాజపేయి చరిత్ర...

కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించి 1999 లో సరిగ్గా ఇదే రోజున బీజేపీకి చెందిన అటల్ బిహారీ వాజపేయి చరిత్ర సృష్టించారు. అయితే, మూడోసారి మాత్రమే పూర్తి కాలంపాటు ప్రధానిగా కొనసాగారు. 1996 లోక్ససభ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించడంతో వాజపేయి నేతృత్వంలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, పార్లమెంటులో పూర్తి మెజారిటీ రాకపోవడంతో వాజపేయి ప్రభుత్వం 13 రోజుల్లోనే పడిపోయింది.
లోక్‌సభకు మళ్లీ 1998 లో ఎన్నికలు జరిగాయి. ఈసారి పలు పార్టీలకు ఎక్కువ సీట్లు రావడంతో.. కొన్ని పార్టీల సాయంతో వాజపేయి నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) ను స్థాపించారు. ఎన్డీఏలో ఉన్న పార్టీల మద్దతుతో వాజపేయి మరోసారి ప్రధాని పీఠం ఎక్కారు. ఈ ప్రభుత్వం కేవలం 13 నెలల పాటు కొనసాగింది. జయలలిత పార్టీ ప్రభుత్వానికి మద్దతు విరమించుకోవడంతో వాజపేయి ప్రభుత్వం దిగిపోయింది. 1999 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఈసారి పూర్తి మెజార్టీ రావడంతో వాజపేయి పూర్తికాలం పాటు పదవి కొనసాగించారు.
అటల్ బిహారీ వాజపేయి తొలిసారి 1952 లో లక్నో లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1957 లో వాజపేయి మొదటి విజయాన్ని అందుకున్నారు. జనసంఘ్ తరఫున మూడు స్థానాలైన లక్నో, మధుర, బలరాంపూర్ నుంచి పోటీ చేశారు. లక్నోలో ఓడిపోగా.. మధురలో డిపాజిట్ కోల్పోయారు. బలరాంపూర్ స్థానం నుంచి విజయం సాధించి లోక్‌సభకు చేరుకున్నారు. తన వాక్పటిమతో సభ్యులను ఆకట్టుకోవడంలో ధిట్ట అయిన వాజపేయి 1994 లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్నారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2013 : మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో 109 మంది దుర్మరణం
2002: ఇండోనేషియాలోని బాలి నైట్‌క్లబ్ పేలుడులో 200 మంది దుర్మరణం, 300 మందికి పైగా గాయాలు
2001: నైజీరియాలో అమెరికా వ్యతిరేక నిరసనల సందర్భంగా మతపరమైన హింసలో దాదాపు 200 మంది మృతి
2000: దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ డే జంగ్కు నోబెల్ శాంతి బహుమతి
1987: బహుముఖ ప్రజ్ఞాశాలి, నటుడు కిశోర్ దా కన్నుమూత
1792: అమెరికా వైట్ హౌస్ నిర్మాణం ప్రారంభం
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశించిన షుగర్.ఫిట్
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
ఆర్థరైటిస్… కీళ్లపై ప్రభావం.. ఇవి పాటిస్తే చాలు హాయి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

