Ram Charan Bodyguard | గ్లోబల్ స్టార్ యాక్టర్ రాంచరణ్ నటించిన పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ ముందు మేకర్స్ విడుదల చేసిన చికిరి చికిరి సాంగ్ నెట్టింటిని ఏ స్థాయిలో షేర్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఇండియాతోపాటు వరల్డ్‌వైడ్‌గా ఉన్న మూవీ లవర్స్, రాంచరణ్ అభిమానులు ఈ పాటకు స్టెప్పులేసి అదరహో అనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
తాజాగా ఓ స్పెషల్ పర్సన్ ఇదే పాటకు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో రౌండప్ చేస్తోంది. ఇంతకీ ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా..? రాంచరణ్ పర్సనల్ బాడీగార్డ్ కెవిన్ కుంట. కొన్నాళ్లుగా నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్న ఈ సెలబ్రిటీ బాడీగార్డ్ చికిరి చికిరి పాటకు హుక్ స్టెప్ వేశాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 21 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయంటే కెవిన్ కుంట క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడీ వీడియో నెట్టింటిని షేక్ చేస్తోంది.
Vadde Naveen | వడ్డే నవీన్ సినిమాలో నటించిన సుమ.. 26 ఏళ్ల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసిన ఇంటర్వ్యూ
Chiranjeevi New Movie | మెగా 158 అప్డేట్: చిరంజీవి-బాబీ మూవీలో కన్నడ బ్యూటీ రచితా రామ్!