Vadde Naveen | వడ్డే నవీన్ సినిమాలో నటించిన సుమ.. 26 ఏళ్ల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసిన ఇంటర్వ్యూ
Vadde Naveen | ఒకప్పుడు ప్రేమకథలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో వడ్డే నవీన్ చాలా కాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత ఆయన మళ్లీ వెండితెరపై కనిపించేందుకు సిద్ధమయ్యారు. ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తున్న వడ్డే నవీన్ ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.
Vadde Naveen | ఒకప్పుడు ప్రేమకథలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో వడ్డే నవీన్ చాలా కాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత ఆయన మళ్లీ వెండితెరపై కనిపించేందుకు సిద్ధమయ్యారు. ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తున్న వడ్డే నవీన్ ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. జూన్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో పలు మీడియా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న వడ్డే నవీన్, తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ప్రముఖ యాంకర్ సుమ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, తన కెరీర్‌లోని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఇంటర్వ్యూలో సుమ మాట్లాడుతూ, తాను కూడా ఒకప్పుడు వడ్డే నవీన్ సినిమాలో నటించిన విషయాన్ని గుర్తు చేశారు. నేను మీ సినిమాలో నటించాను. ‘చాలా బాగుంది’ సినిమా షూటింగ్ 1999లో జరిగింది. అందులో పెళ్లి చూపుల సీన్లో నేను కనిపిస్తాను. అప్పటికి నేను గర్భవతిని కూడా. ఆ సినిమాకు ఈవీవీ సత్యనారాయణ గారు దర్శకత్వం వహించారు. సినిమా 2001లో విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది అని చెప్పారు. సుమ చెప్పిన విషయాలను వడ్డే నవీన్ కూడా గుర్తు చేసుకుంటూ, ఆ రోజులను స్మరించుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆ సంఘటనలను గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
శ్రీకాంత్, వడ్డే నవీన్ హీరోలుగా తెరకెక్కిన ‘చాలా బాగుంది’ చిత్రం ఆ కాలంలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 1999లో షూటింగ్ పూర్తి అయినప్పటికీ, కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యమై 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైన తర్వాత మంచి విజయాన్ని అందుకుంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, వినోదభరితమైన సన్నివేశాలు, హీరోల నటన సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి.ఈ సినిమాలో యాంకర్ సుమ చిన్న పాత్రలో కనిపించారు. కథ మొదట్లో వడ్డే నవీన్‌కు పెళ్లి చూపులు జరిగే సన్నివేశంలో పెళ్లికూతురి పాత్రలో ఆమె నటించారు. ఆ సన్నివేశం అప్పట్లో పెద్దగా గుర్తింపు పొందకపోయినా, ఇప్పుడు సుమ స్వయంగా ఆ విషయాన్ని గుర్తు చేయడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

