Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘MEGA158’ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన కాస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం మొదట మలయాళ బ్యూటీ హనీ రోజ్‌ను అనుకున్నారు. అయితే డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుని, అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేసిందని ఇండస్ట్రీ టాక్. ఇప్పుడు ఆ కీలక పాత్ర కోసం కన్నడ స్టార్ హీరోయిన్ రచితా రామ్‌ను మేకర్స్ ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. గతంలో ‘సూపర్ మచ్చి’ చిత్రంలో నటించిన రచితకు తెలుగులో ఇది రెండో సినిమా. కూలీ సినిమాతో రచితకు మంచి గుర్తింపు రాగా.. ఈ సినిమా మరింత ప్లస్ కాబోతుందని సమాచారం. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, బాబీ కొల్లి కాంబోలో వస్తున్న ఈ చిత్రంలో చిరు కూతురిగా మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ నటిస్తుండగా, ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తమిళనాడులోని పొల్లాచ్చి పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుగుతోంది.