KTR | సింగపూర్ ఎన్నారై ప్రతినిధులతో కేటీఆర్ ప్రత్యేక సమావేశం
KTR | బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సింగపూర్ ఎన్నారై ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సింగపూర్‌లో జరుగుతున్న అభివృద్ధి, పట్టణ ప్రణాళిక, ప్రజా రవాణా, పారిశుద్ధ్యం, టెక్నాలజీ వినియోగం వంటి అనేక అంశాలపై కేటీఆర్ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు.
KTR | కౌలాలంపూర్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం మలేషియా వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సింగపూర్ ఎన్నారై ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సమావేశంలో సింగపూర్‌లో జరుగుతున్న అభివృద్ధి, పట్టణ ప్రణాళిక, ప్రజా రవాణా, పారిశుద్ధ్యం, టెక్నాలజీ వినియోగం వంటి అనేక అంశాలపై కేటీఆర్ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. అలాగే గతంలో కేసీఆర్ సింగపూర్, మలేషియా పర్యటనల సందర్భంగా అక్కడి అభివృద్ధి నమూనాలను అధ్యయనం చేసిన విషయాలను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.
సింగపూర్‌లో కూడా తెలంగాణ సభ నిర్వహించాలని..
సింగపూర్, మలేషియా దేశాల్లో అమలవుతున్న అభివృద్ధి విధానాలలో తెలంగాణలో అనుసరించదగిన అంశాలపై కూడా చర్చ జరిగింది. తెలంగాణను ప్రపంచ స్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాల అభివృద్ధి నమూనాలను తీసుకురావాల్సిన అవసరాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా సింగపూర్ ఎన్నారై ప్రతినిధులు సింగపూర్‌లో కూడా తెలంగాణ సభ నిర్వహించాలని కేటీఆర్ కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు.
ఈ సమావేశంలో వివిధ తెలంగాణ, తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యంగా తెలుగు సమాజం సభ్యులు, తెలంగాణ కల్చరల్ సొసైటీ సభ్యులు, బీఆర్ఎస్ ఎన్నారై సభ్యులు, సింగపూర్ వాసవి సభ్యులు పాల్గొన్నారు. వీరంతా ప్రత్యేకంగా బస్సుల్లో మలేషియాకు చేరుకుని ఈ సమావేశంలో పాల్గొనడం విశేషం.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ , మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్, బీఆర్ఎస్ సింగపూర్ సభ్యులు రంజిత్ రావు, పెద్ది శేఖర్, రజినీకాంత్, కిరణ్ షెర్ల, టీసీఎస్ఎస్ సభ్యులు నల్లా భాస్కర్, రాజు, వీఏఎం సభ్యులు కైల నాగరాజు, రమణ, ఎస్టీఎస్ సభ్యులు కోటి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బైరి రవి తదితరులు పాల్గొన్నారు.


Read Also :
Vadde Naveen | వడ్డే నవీన్ సినిమాలో నటించిన సుమ.. 26 ఏళ్ల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసిన ఇంటర్వ్యూ
Chiranjeevi New Movie | మెగా 158 అప్డేట్: చిరంజీవి-బాబీ మూవీలో కన్నడ బ్యూటీ రచితా రామ్!
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

