honey trap | హనీట్రాప్‌లో ఐఏఎఫ్ వింగ్ కమాండర్.. పాకిస్తాన్‌కు రహస్య సమాచారం చేరవేత
honey trap : పాకిస్తానీ మహిళ హనీట్రాప్ వలలో చిక్కుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) వింగ్ కమాండర్ అధికారిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతడు దేశ రక్షణకు సంబంధించిన సున్నితమైన, రహస్యమైన సమాచారాన్ని ఆ మహిళకు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు.
honey trap : పాకిస్తానీ మహిళ హనీట్రాప్ వలలో చిక్కుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) వింగ్ కమాండర్ అధికారిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతడు దేశ రక్షణకు సంబంధించిన సున్నితమైన, రహస్యమైన సమాచారాన్ని ఆ మహిళకు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఆ అధికారి పేరును మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి. ఐఏఎఫ్ వింగ్ కమాండర్‌కు సోషల్ మీడియా ద్వారా ఒక మహిళ పరిచయమైంది. ఆమె.. పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ సర్వీసెస్ కోసం పని చేస్తుంది. ఇండియాకు చెందిన రక్షణ, రహస్య సమాచారాన్ని సేకరించడమే ఇలాంటి మహిళల లక్ష్యం.
రక్షణ అధికారుల్ని హనీ ట్రాప్‌లో దించి, భారత రహస్యాల్ని సేకరిస్తుంటారు. ఈ ఘటనలో కూడా ఐఏఎఫ్ అధికారిని పాక్ మహిళ అలాగే హనీ ట్రాప్‌లోకి దించింది. దాదాపు రెండేళ్ల నుంచి వీరి మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. మొదట సోషల్ మీడియా ద్వారా పాక్ మహిళ వింగ్ కమాండర్‌ను పరిచయం చేసుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా అతడి ఫోన్లోకి ఒక రహస్య యాప్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పింది. అయితే, ఇందుకోసం ఆ అధికారి వేరే మొబైల్ ఉపయోగించాడు. ఈ యాప్ ఇక్కడి డాటా సేకరణకు ఉపయోగపడుతుంది. ఇదే సమయంలో మొబైల్ ద్వారా ఏం మాట్లాడుతున్నారో నిరంతరం వినే వీలుంటుంది. ఈ రహస్య యాప్ పనితీరు గురించి, ఇంకా పూర్తి వివరాలు తెలియదు. మరోవైపు ఐఏఎఫ్ అధికారికి బాగా దగ్గరైన ఆ మహిళతో అతడు రెగ్యులర్ చాటింగ్ చేసేవాడు. వీడియో కాల్స్ చేసుకునే వాళ్లు. ఇక్కడి ఫొటోలు, వీడియోలు తీసి అతడు ఆమెకు షేర్ చేసేవాడు.
అలాగే, రక్షణ విభాగానికి చెందిన రహస్య సమాచారాన్ని కూడా అతడు ఆమెకు చేరవేశాడు. ఆమె అడిగిన కీలక వివరాల్ని అందజేశాడు. ఈ విషయంపై నిఘా ఉంచిన ఐఏఎఫ్ ఉన్నతాధికారులు అతడిపై ఫిర్యాదు చేశారు. దీంతో గత మే 30న ఆ ఐఏఎఫ్ అధికారిని ఢిల్లీ పోలీసులు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద అరెస్టు చేశారు. జుడీషియల్ కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపారు. అతడు ఆమెకు ఏ సమాచారం చేరవేశారు వంటి వివరాల్ని పోలీసులు సేకరించారు. అలాగే, చాటింగ్, వీడియో కాల్స్, వీడియోలు, ఫొటోల్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో కీలక విచారణ పూర్తైంది. దీంతో జూలై 30న ఛార్జిషీటు దాఖలు చేశారు. కోర్టులో కేసు విచారణ సాగుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

