e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 16, 2021
Home News Pakistan : ఇమ్రాన్‌ఖాన్‌-బజ్వా మధ్య పెరుగుతున్న దూరం.. కారణమేంటంటే..?

Pakistan : ఇమ్రాన్‌ఖాన్‌-బజ్వా మధ్య పెరుగుతున్న దూరం.. కారణమేంటంటే..?

ఇస్లామాబాద్‌ : (Pakistan) పాకిస్తాన్‌లో ప్రభుత్వంపై ఆర్మీ పైచేయి సాధించేందుకు మరోమారు సిద్ధమైంది. ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌-ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వా మధ్య దూరం పెరుగుతున్నట్లుగా కనిపిస్తున్నది. దీనికి ప్రధాన కారణం ఐఎస్‌ఐ చీఫ్‌ బదిలీయే కారణమని పాకిస్తాన్‌ పత్రికలు వాదిస్తున్నాయి. ఐఎస్‌ఐ చీఫ్‌ బదిలీని నిలుపాలని ఇమ్రాన్‌ఖాన్‌ అంటుండగా.. ఆర్మీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని బజ్వా హెచ్చరిక స్వరంతో చెప్తున్నారు. దాంతో వారం రోజులుగా ఇద్దరు హెడ్స్‌ ఎడమొగం, పెడమొగంగా ఉంటున్నారు.

ఐఎస్‌ఐ చీఫ్‌గా ఉన్న ఫైజ్‌ హమీద్‌ స్థానంలో గత వారం లెఫ్టినెంట్ జనరల్‌ నదీమ్‌ అహ్మద్‌ అంజుమ్‌ను ఆర్మీ చీఫ్‌ బజ్వా నియమించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారం హస్తగతం చేసుకున్న తాలిబాన్‌తో అంటకాగుతున్నాడని ఫైజ్‌ హమీద్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ఆయనను ఐఎస్‌ఐ చీఫ్‌ పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో నదీమ్‌ అహ్మద్‌ అంజుమ్‌ను నియమించారు. తన అనుమతి లేకుండా ఐఎస్‌ఐ చీఫ్‌ను మార్చడం పట్ల ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆగ్రహంతో ఉన్నారు. అయితే, ఇమ్రాన్ ఖాన్ కార్యాలయం దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇప్పటివరకు జారీ చేయలేదు. దాంతో వారం రోజులుగా ఇమ్రాన్ ఖాన్-బజ్వా మధ్య మాటల ఘర్షణ జరుగుతున్నట్లు సమాచారం.

- Advertisement -

ఇలాఉండగా, ఇమ్రాన్ ఖాన్-ఆర్మీ చీఫ్ బజ్వా మధ్య ఎలాంటి వివాదం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తున్నది. ఇమ్రాన్ ఖాన్-బజ్వా మధ్య ఐఎస్‌ఐ చీఫ్‌ని మార్చడంపై సుదీర్ఘ చర్చ జరిగిందని, ఈ విషయంలో ప్రభుత్వాన్ని బజ్వా విశ్వాసంలోకి తీసుకున్నారని పాకిస్తాన్ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి గత వారం మీడియాతో చెప్పారు. ఆర్మీ చీఫ్‌తో చర్చించిన మీదట ఐఎస్‌ఐ చీఫ్‌ను నియమించే హక్కు ప్రధానమంత్రికి ఉంటుందని చట్టాన్ని ఉటంకిస్తూ మంత్రి ఫవాద్‌ చౌదరి చెప్పారు. కాగా, ఫైజ్‌ హమీద్ తన అనుమతి తీసుకోకుండానే కాబూల్ వెళ్లడంపై కలత చెందిన బజ్వా.. ఐఎస్‌ఐ చీఫ్ పదవి నుంచి ఆయనను తొలగించినట్లు పాకిస్తాన్‌ మీడియా నివేదికలు చెప్తున్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి..

పిల్లల్ని అతిగా పొగడకండి.. ఎందుకో తెలిపిన బ్రిటన్‌ అధ్యయనం

సైకిళ్ల శ్మశానం.. ఎక్కడున్నదంటే..?!

లఖింపూర్‌ ఖేరీలో రైతు స్మారకం.. ఐదుగురు మృతుల విగ్రహాల ఏర్పాటు

బేబీ షవర్‌ ఫంక్షన్‌ జరుపుకున్న ఫ్రీదా పింటో

ట్రంప్‌కు సౌదీ రాజు ఇచ్చినవి నకిలీ బహుమతులంట.. దర్యాప్తులో బట్టబయలు

ముచ్చటగా మూడోసారి ప్రధానిగా వాజపేయి

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement