Bicycle Cemetery : సైకిళ్ల శ్మశానం.. ఎక్కడున్నదంటే..?!
Bicycle Cemetery : టోక్యో : (Bicycle Cemetery) జపాన్ చాలా చిన్న దేశం. ఇండ్లు కట్టుకుని ఉండేందుకే స్థలం కరువై పోతున్న సమయంలో.. పనికిరాని వస్తువులను పెట్టడం అక్కడి వారికి తలనొప్పిగా మారింది. మరీ ముఖ్యంగా చెడిపోయిన సైకిళ్లు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నాయి. పాడైపోయిన సైకిళ్లను నిల్వచేసేందుకు స్థలం లేకపోవడంతో వాటిని యార్డుల్లో పడేస్తున్నారు. దాంతో సైకిళ్ల శ్మశానం తయారైంది....

టోక్యో : (Bicycle Cemetery) జపాన్ చాలా చిన్న దేశం. ఇండ్లు కట్టుకుని ఉండేందుకే స్థలం కరువై పోతున్న సమయంలో.. పనికిరాని వస్తువులను పెట్టడం అక్కడి వారికి తలనొప్పిగా మారింది. మరీ ముఖ్యంగా చెడిపోయిన సైకిళ్లు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నాయి. పాడైపోయిన సైకిళ్లను నిల్వచేసేందుకు స్థలం లేకపోవడంతో వాటిని యార్డుల్లో పడేస్తున్నారు. దాంతో సైకిళ్ల శ్మశానం తయారైంది.
జపాన్ ప్రజలు పెద్ద ఎత్తున సైకిళ్లను ఉపయోగిస్తున్నారు. చౌక ప్రయాణంతోపాటు ఆరోగ్యం కూడా పొందే సాధనం కావడంతో అక్కడి ప్రజలకు సైకిల్ ప్రియమైన వస్తువుగా తయారైంది. అదే సమయంలో, పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వారు కోరుకుంటున్నారు. జపాన్‌లో 80 మిలియన్లకు పైగా సైకిళ్లు ఉండటానికి కారణం కూడా ఇదే.
అయితే, కొంతకాలంగా జపాన్‌లోని పలు నగరాల్లో సైకిళ్ల వినియోగం తగ్గినట్లు తెలుస్తున్నది. వాటిని ఇంట్లో ఉంచుకునేందుకు స్థలం లేకపోవడంతో వాటిని యార్డ్‌లో పడేస్తున్నారు. తక్కువ జనాభా ఉన్న సైతామా నగరం నుంచి దాదాపు 70 వేల సైకిళ్లు యార్డులో విసిరేశారు. దాంతో మినీ శ్మశానంగా తయారైంది. వీటిలో పిల్లలు మొదలుకొని పెద్దల వరకు సైకిళ్లు ఉన్నాయి. సైతామా మేయర్ హయాటో షిమిజు దీని గురించి ఆందోళన వ్యక్తం చేశారు. సైకిళ్లను డంపింగ్ చేయడానికి బదులుగా అవసరమైన వారికి ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
లఖింపూర్ ఖేరీలో రైతు స్మారకం.. ఐదుగురు మృతుల విగ్రహాల ఏర్పాటు
బేబీ షవర్ ఫంక్షన్ జరుపుకున్న ఫ్రీదా పింటో
ట్రంప్‌కు సౌదీ రాజు ఇచ్చినవి నకిలీ బహుమతులంట.. దర్యాప్తులో బట్టబయలు
ముచ్చటగా మూడోసారి ప్రధానిగా వాజపేయి
హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశించిన షుగర్.ఫిట్
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

