న్యూఢిల్లీ: ఆన్లైన్ ఉద్యమానికి చెందిన కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఇవాళ ఢిల్లీ చేరుకున్నాడు. నగరంలోని జంతర్ మంతర్ వద్ద ప్రణాళిక ప్రకారం నిరసన చేపట్టనున్నాడు. అయితే ఆందోళనకారులకు అభిజీత్ పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో నిరసన చేపట్టాలన్నారు. ప్రదర్శన శాంతియుతంగా జరగాలన్నారు. ఢిల్లీలో విమానం దిగినట్లు అభిజీత్ తన ఎక్స్ అకౌంట్లో ఓ పోస్టు చేశారు. జంతర్ మంతర్ వద్ద కలిసేందుకు ఎదురుచూస్తున్నట్లు ఆ ట్వీట్లో పేర్కొన్నాడు. బుక్‌తో పాటు జాతీయ జెండాను పట్టుకుని రావాలని తన ట్వీట్లో తెలిపాడు.
జంతర్ మంతర్‌కు వచ్చే దారిలో పోలీసులకు పువ్వులు ఇచ్చి తమ శాంతిని తెలియజేయలన్నాడు. ప్రేమ, శాంతితో ఈ ఉద్యమాన్ని కొనసాగించాలన్నాడు. ఒకవేళ అభిజీత్ దీప్కేను అరెస్టు చేస్తే, తాము ఆరు వారాల నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తెలిపారు. నీట్, సీబీఎస్ఈ, సీయూఈటీ, ఎస్ఎస్సీ పరీక్షల్లో జరిగిన అవకతవకలను వ్యతిరేకిస్తూ ఆన్లైన్లో సీజేపీ పార్టీ ఏర్పడింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తున్నది.
Landed.
Looking forward to meet you all at Jantar Mantar. Do not forget to carry a book and our Tiranga!
Offer flowers to policemen as a gesture of compassion & gratitude.
We have to lead this movement with love and peace! https://t.co/HgDSf2gX0U
— Abhijeet Dipke (@abhijeet_dipke) June 6, 2026