బూర్గంపహాడ్, ఆగస్టు 15 : సంత సమీపంలో ఎదురెదురుగా ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ విద్యుత్ సబ్ స్టేషన్లో లైన్మెన్గా పని చేస్తున్న జగన్మోహన్రెడ్డి బైక్పై వెళ్తుండగా సంత ప్రాంగణానికి చేరుకునే లోగా మరో బైక్ వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో జగన్మోహన్రెడ్డి తలకు బలమైన గాయమైంది. బుడ్డగూడెం గ్రామానికి చెందిన పాయం దినేశ్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వీరిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స చేసి అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో భద్రాచలం ఆస్పత్రికి తరలించారు.