ఆ ప్రచారంలో వాస్తవంలేదు..: టీటీడీ
టీటీడీ| ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు తిరస్కరించడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. తిరుమలలో తమ సిఫారసు లేఖలను తిరస్కరిస్తున్నారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అదంత నిరాధారమని అధికారులు తెలిపారు.

తిరుమల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు తిరస్కరించడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. తిరుమలలో తమ సిఫారసు లేఖలను తిరస్కరిస్తున్నారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అదంత నిరాధారమని అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గతంలో ఏవిధానం అమలు జరిగేదో ఇప్పుడు కూడా అలాగే అమలు జరుగుతోందని చెప్పారు. ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదని వివరించారు.
గతవారం కొందరు ప్రజా ప్రతినిధులు వారి కోటాకు మించి లేఖలు ఇచ్చారని, వీఐపీ బ్రేక్ దర్శనం సమయం తక్కువగా ఉండటం, ఎక్కువ మంది ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు రావడంతో కోటాకు మించి వచ్చిన లేఖలను తిరస్కరించామని తెలిపారు. అయినప్పటికీ కొందరు ఫోన్ చేసి తమకు ముఖ్యమైన వారని చెప్పడంతో వాటికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మంజూరు చేసి స్వామివారి దర్శనం చేయించినట్లు వెల్లడించారు. అలాగే గదులకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. వాస్తవాలు ఇలా ఉంటే కొందరు వ్యక్తులు అవాస్తవ ఆరోపణలు చేయడం తగదని ప్రజలు ఇలాంటివి నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
‘కోపా అమెరికా’ విజేత అర్జెంటీనా
దేశంలో కొత్తగా 41 వేల కరోనా కేసులు
‘వర్జిన్ గెలాక్టిక్’.. నేడు రోదసీలోకి తెలుగమ్మాయి
తాలిబన్ ఎఫెక్ట్.. ఆఫ్ఘనిస్థాన్ నుంచి 50 మంది భారత అధికారులు వెనక్కి
దిగివచ్చిన ట్విటర్.. ఫిర్యాదు అధికారిగా వినయ్ ప్రకాశ్ నియామకం
జమ్ములో ఎన్ఐఏ తనిఖీలు.. ఐదుగురు అరెస్టు
కేరళలో మరో జికా వైరస్ కేసు.. 15కు చేరిన బాధితులు
హమ్మయ్య.. మెస్సీ మొత్తానికి సాధించాడు
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

