(Power purchase) అమరావతి: ఏపీలో జగన్ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాకిచ్చింది. సౌర విద్యుత్ కొనుగోళ్లపై వైసీపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సాకి) నుంచి సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయడంపై సీపీఐ రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎక్కువ ధరకు ఎందుకు కొనుగోళ్లు చేయాల్సి వచ్చిందో వివరించాలని నోటీసులో హైకోర్టు ప్రశ్నించింది.
సెకీ నుంచి భారీ ఎత్తున సౌర విద్యుత్ కొనుగోళ్లకు ఏపీ సర్కార్ గతంలోనే ఆమోదం తెలిపింది. దీనికి ఏపీ ఈఆర్సీ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనిపై విపక్షాలు చేసిన అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. సోలార్ పవర్ కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదని సీపీఐ రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఏపీ సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది. ఎక్కువ ధరకు ఎందుకు కొనుగోలు చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో అదానీ సంస్థ, రాష్ట్ర ఇంధన శాఖతోపాటు మరో 10 మందికి నోటీసులు ఇచ్చింది.
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
కరోనాలా భయపెట్టిన అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..