ఇచ్చోడ, జనవరి 02 : ఆదిలాబాద్(Adilabad )జిల్లా ఇచ్చోడ మండలంలోని దుబార్‌పేట సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మామడ మండలంలోని పులి మడుగుకు చెందిన మడావి రాజు(30) తన స్నేహితుడు తులసిరాంతో కలిసి నాగోబా జాతరకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్నారు.
మార్గమధ్యలో ఇచ్చోడలోని దుబార్‌పేట సమీపంలో ఎన్‌హెచ్ 44పై తన మోటర్ సైకిల్ అతివేగంగా నడుపుతూ లారీని ఓవర్ టేక్ చేయబోయి సడన్ బ్రేక్ వేయడంతో అదుపు తప్పి తలకు తీవ్ర గాయమైంది. హైవే అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని రిమ్స్ తరలించగా శనివారం మృతి చెందాడు. మృతుడి అక్క ఆడె శంకుతల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు.
ఇవి కూడా చదవండి..