Thandel | టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా ప్రాజెక్ట్ తండేల్ (Thandel). చందూమొండేటి డైరెక్షన్లో రొమాంటిక్ డ్రామా ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రంలో సాయిపల్లవి (Sai Pallavi) హీరోయిన్గా నటిస్తోంది. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం.
తండేల్ మాస్ జాతర ఈవెంట్ నేడు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగనుందని తెలిసిందే. ఈవెంట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. కాగా గతేడాది డిసెంబర్ 4న రాత్రి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) బెనిఫిట్ షో నేపథ్యంలో అల్లు అర్జున్ రాక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ (9)కు గాయలయ్యాయని తెలిసిందే.
ఈ ఘటనలో అరెస్టైన అల్లు అర్జున్ బెయిల్‌పై విడుదల కూడా అయ్యాడు. మృతురాలి కుటుంబానికి ఆర్థికసాయం కూడా ప్రకటించి అండగా ఉంటామని హామీ కూడా ఇచ్చింది బన్నీ టీం. కాగా తండేల్ మాస్ జాతర ఈ ఘటన తర్వాత జరుగుతున్న ఈవెంట్ కావడం.. అందులోనా అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా వెళ్తుండటంతో బన్నీ స్పీచ్ ఎలా ఉండబోతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోన్న ఈ మూవీని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. తండేల్ నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా ఇది.
Game Changer | రాంచరణ్ అభిమానులకు ఎస్ థమన్ సారీ.. గేమ్ ఛేంజర్ గురించి ఏం చెప్పాడంటే..?
THE PARADISE | ఫిబ్రవరి.. జిమ్ సెషన్ స్టిల్‌తో నాని ఇచ్చిన హింట్ ఇదే