Trains | బెల్లంపల్లి, జూన్ 27 : పెద్దపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని కునారం ఆర్వోబీ వద్ద క్లస్టర్ విరిగిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో కాజీపేట మార్గంలో నడిచే రైళ్లన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో బెల్లంపల్లి రైల్వేస్టేషన్లో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తెల్లవారుజామున సికింద్రాబాద్కు వెళ్లే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలును రాఘవాపురంలో నిలిపివేశారు. ఆ రైలులో బెల్లంపల్లి నుంచి ప్రయాణిస్తున్న వారికి గంటలకొద్దీ రైలును ఆపివేయడంతో అర్ధం కాలేదు.
సిగ్నల్ లేక ఆపారని ముందు నిర్ధారించుకున్న తర్వాత క్లస్టర్ విరిగిపోయిందని తెలుసుకుని, రైళ్లు వెళ్లవని తెలుసుకున్నప్రయాణికులు బస్సులు, ఆటోలు, ప్రయివేట్ వాహనాలను ఆశ్రయించారు. కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలో టెట్ పరీక్ష రాయడానికి వెళ్లిన అభ్యర్థులు ఆందోళన చెందారు. తర్వాత ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు.
మిగతా అన్ని రైళ్లను ఒక రోజు రద్దు చేయడంతో బెల్లంపల్లి రైల్వే.. స్టేషన్కు వచ్చిన ప్రయాణీకులు వెనుదిరిగి వెళ్లిపోయారు. మరికొంత మంది ప్రయివేట్ వాహనాలను ఆశ్రయించారు. మరికొంతమంది సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు రైల్వేస్టేషన్లో నిరీక్షించారు.
Trains 3
Transformer | ట్రాన్స్ఫార్మర్ పెట్టారు.. కానీ కనెక్షన్ మాత్రం మరిచారు.. ముళ్ల పొదల్లో ఇలా