వెల్దుర్తి, జూన్ 27: నిరుపేదల వైద్యం ఖర్చులకు సీఎంఆర్ఎఫ్ పథకం ఆర్థికంగా అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy) అన్నారు. వెల్దుర్తి మండలంలోని మానేపల్లికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి రూ.37,500, ఏదులపల్లికి చెందిన చిదంబర్ రూ.60,000, వెల్దుర్తికి చెందిన మమత రూ.40,500, పెద్దాపూర్‌కు చెందిన మల్లేశ్ రూ.48,000, నెల్లూర్‌కు చెందిన అనిల్ రూ.5,000లకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు రాగా శుక్రవారం తన కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు భూపాల్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల వైద్యానికి సీఎంఆర్ఎఫ్ పథకం భరోసా కల్పిస్తూ వారిని ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణగౌడ్, ప్రవీణ్, సుధాకర్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.