India-Israel | ఇకపై ఇజ్రాయెల్‌లోనూ యూపీఐ సేవలు : ప్రధాని మోదీ
India-Israel | భారత్ - ఇజ్రాయెల్ (India-Israel) మధ్య సంబంధాలు ప్రతి సవాల్‌ను తట్టుకుని కాలపరీక్షకు నిలిచాయని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. పరస్పర విశ్వాసం, ప్రజాస్వామ్య విలువలపై ఏర్పడిన ఈ బంధం ఎంతో బలమైనదని పేర్కొన్నారు.
India – Israel : భారత్ – ఇజ్రాయెల్ (India-Israel) మధ్య సంబంధాలు ప్రతి సవాల్‌ను తట్టుకుని కాలపరీక్షకు నిలిచాయని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. పరస్పర విశ్వాసం, ప్రజాస్వామ్య విలువలపై ఏర్పడిన ఈ బంధం ఎంతో బలమైనదని పేర్కొన్నారు. ఇరు దేశాల భాగస్వామ్యాన్ని ‘శాంతి, ఆవిష్కరణ, శ్రేయస్సు కోసం ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచుతూ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
జెరూసలేంలో గురువారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహుతో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. అంతకుముందు ఇరుదేశాల మధ్య పలు కీలక అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) జరిగాయి. కృత్రిమ మేథ (AI), క్వాంటం, క్రిటికల్ మినరల్స్ వంటి రంగాల్లో సహకారాన్ని వేగవంతం చేసేందుకు ‘క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ పార్ట్నర్షిప్’ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌లో యూపీఐ సేవలను వినియోగించేందుకు ఒప్పందం కుదరడం సంతోషంగా ఉందన్నారు.
వ్యవసాయ రంగంలో సహకారానికి సుదీర్ఘ చరిత్ర ఉందని, దీన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని ప్రధాని చెప్పారు. ఇజ్రాయెల్ సహకారంతో భారత్‌లో ఏర్పాటు చేసిన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ విజయవంతం కావడంతో వాటి సంఖ్యను 100కు పెంచనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి తుదిరూపు ఇస్తామని పేర్కొన్నారు.
ఉగ్రవాదంపై ఇరుదేశాల వైఖరి స్పష్టంగా ఉందని, దానికి ప్రపంచంలో చోటులేదని మోదీ స్పష్టంచేశారు. గాజా శాంతి ప్రణాళిక ద్వారా శాంతికి మార్గం ఏర్పడిందని, ఈ ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతు ఇచ్చిందని పునరుద్ఘాటించారు. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఇజ్రాయెల్ చారిత్రక గడ్డపై అడుగుపెట్టడం గర్వంగా, భావోద్వేగంగా ఉందని మోదీ అన్నారు.
ఇజ్రాయెల్ పార్లమెంట్ ‘క్నెస్సెట్’లో ప్రసంగించే అవకాశం కల్పించినందుకు, స్పీకర్ మెడల్‌తో సత్కరించినందుకు ఆ దేశ ప్రధాని నెతన్యాహుకు, ఇజ్రాయెల్ ప్రజలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన చిన్నదే అయినప్పటికీ, అది అసాధారణంగా ఫలవంతమైందని, హృదయాలను కదిలించిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. గురువారం జెరూసలేంలో ఇద్దరి మధ్య చర్చల అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘ఇది ఒక అద్భుతమైన పర్యటన. పర్యటన ముగింపు కూడా అంతే అద్భుతంగా ఉంది. నిన్న ఇజ్రాయెల్ పార్లమెంట్ ‘క్నెస్సెట్’లో మోదీ చేసిన ప్రసంగం అందరి కళ్లను చెమర్చేలా చేసింది’ అని నెతన్యాహు ప్రశంసించారు. ఇరు దేశాల్లోని ప్రతిభావంతుల మధ్య సహకారం గురించి చర్చించామని, వాటిని నిర్దిష్ట ప్రణాళికలుగా మారుస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా భారత్‌లో ప్రభుత్వ స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు. ఇది ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పనిచేస్తోందని నెతన్యాహు కితాబిచ్చారు. ‘ఆవిష్కరణలను అందిపుచ్చుకున్న వారికే భవిష్యత్తు ఉంటుంది. భారత్, ఇజ్రాయెల్ గర్వించదగిన ప్రాచీన నాగరికతలు భవిష్యత్తును అందిపుచ్చుకోవడానికి మేం నిశ్చయించుకున్నాం. కలిసికట్టుగా మరింత అభివృద్ధి సాధించగలం’ అని అన్నారు. ప్రెసిషన్ అగ్రికల్చర్, ప్రెసిషన్ ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో కలిసి పనిచేయడం ద్వారా ప్రతి ఒక్కరి సామర్థ్యాన్ని వెలికితీయవచ్చని అభిప్రాయపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

