BRS party | కుభీర్, అక్టోబర్ 07 : కేసిఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడా వన్నె తగ్గలేదని పార్టీ నాయకులు , కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఎక్కువ సంఖ్యలో గెలిపించుకోవాలని పార్టీ మండల అధ్యక్షుడు ఎన్నిల అనిల్ అన్నారు.
నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో ఎంపీటీసీ పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకుగాను ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన నాయకులు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని పోగొట్టుకుందని.. దీనికిగాను పార్టీ అధిష్టానం రూపొందించిన బాకీ కార్డులను ఇంటింటికి వెళ్లి బాకీ పడ్డ పథకాలను గురించి వివరించాలని సూచించారు. పోటీ చేసే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థులు రంగంలో ఉంటారని పేర్కొన్నారు.
రానున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని ఎవరు నిరాశలో ఉండకూడదని కోరారు. అనంతరం కుబీర్ టౌన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ పార్టీ నాయకుడు గంధం పోశెట్టిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా గోరెకర్ కాశీనాథ్ ను ఎన్నుకొని సత్కరించి అభినందించారు. సీనియర్ పార్టీ నాయకులు, ఉద్యమకారుడు పుప్పాల పీరాజీ, మాజీ వైస్ ఎంపీపీ మోహియోద్దీన్, మాజీ సర్పంచ్ గోరెకర్ బాబు, గిరి పోశెట్టి, అశ్వక్, దంతుల దత్తాత్రి, పోగుల పోతన్న, బంక మధు, ముచిండ్ల సాయినాథ్, బి గంగాధర్, నర్సింలు, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Kumram Bheem | కుమ్రం భీం ఆశయ సాధనకు కృషి చేయాలి : బానోత్ గజానంద్
Chief Justice BR Gavai | చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి హేయమైన చర్య : గుణిగంటి మోహన్
Metpalli | సీజేఐపై దాడికి నిరసనగా విధుల బహిష్కరణ