ఆ పాత్ర మిస్సయ్యాను
నటనలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న యాక్టర్ లయ. సినిమాలకు టాటా చెప్పి అమెరికాలో స్థిరపడింది. ఇటీవలే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. నటుడు శివాజీతో కలిసి.. ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అంటూ ఫ్యామిలీ థ్రిల్లర్‌తో థియేటర్లలో సందడి చేస్తున్నది. ఈ సందర్భంగా లయ పంచుకున్న కబుర్లు ఇవి..
నటనలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న యాక్టర్ లయ. సినిమాలకు టాటా చెప్పి అమెరికాలో స్థిరపడింది. ఇటీవలే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. నటుడు శివాజీతో కలిసి.. ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అంటూ ఫ్యామిలీ థ్రిల్లర్‌తో థియేటర్లలో సందడి చేస్తున్నది. ఈ సందర్భంగా లయ పంచుకున్న కబుర్లు ఇవి..
నా కూతురు శ్లోకాకు నాలాగే యాక్టింగ్ అంటే ఇష్టం. గతంలో రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలో ఇలియానా చిన్నప్పటి పాత్రలో నటించింది. సినిమాల్లో రాణించాలనే ఆలోచనతో ఉన్నది. అవకాశం వస్తే తనూ మీ ముందుకు వస్తుంది.
‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాలో పాయ అంటూ సాగే పాట విని ఆశ్చర్యానికి గురయ్యాను. నిజంగా నాకు ఆ సమయంలో పాయ అంటే తెలియదు. ‘ఆ మాత్రం కూడా తెలియదా!’ అని మీరు అనుకోవచ్చు కానీ నాకు నిజంగా తెలీదండి. ఆ తరువాత తెలుసుకున్నా.. పాయ అంటే ఓ నాన్‌వెజ్ వంటకం
అని.
అరవింద సమేత సినిమాలో జగపతిబాబు భార్య పాత్ర చేయమని ఆఫరొస్తే అది మరీ చిన్నరోల్ అని భావించి తిరస్కరించాను. సినిమా విడుదలయ్యాక తెలిసింది నేను చేసిన తప్పేమిటో? చాలా పవర్ఫుల్ రోల్ మిస్స్ అయ్యాను అని బాధపడ్డాను. పూర్తి కథ వినకుండానే ఆ పాత్రను వదులుకున్నందుకు పశ్చాత్తాపడ్డాను. ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల సూపర్‌హిట్ సినిమాల్లో అవకాశాలు కోల్పోయాను.
ఒకసారి హైదరాబాద్‌లో విహారయాత్రకు వెళ్లినప్పుడు అక్కినేని కుటుంబరావు టీమ్ నన్ను చూశారు. వాళ్లు తీయబోయే ‘భద్రం కొడుకో’ సినిమాలో బాలనటిగా చేయమని అడిగారు. నేనూ ఇష్టంతో నటించా. ఆ తరువాత రాఘవేంద్రరావు నిర్వహించిన జెమినీ టీవీ స్టార్ 2000 కంటెస్ట్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చా. ఆ పోటీలో శివాజీ కూడా పాల్గొన్నారు. అప్పటినుంచే మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. శివాజీతో కలిసి ‘మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా’ సినిమాల్లో చేశాను. ఆయనతో పనిచేయడం ఎంతో ఈజీ. నటనకు స్వేచ్ఛనిచ్చే మనిషి శివాజీ.
తెలుగు హీరోల్లో బాలకృష్ణగారి రూటే సపరేట్. ఆయనతో కలిసి నటించిన విజయేంద్ర వర్మ సినిమా ఎంతో ప్రత్యేకం. బాలయ్య షూటింగ్ సెట్లో ఉంటే ఆ ప్రాంతమంతా గంభీరమైన వాతావరణం నెలకొంటుంది. పనిపట్ల ఆయనకున్న నిబద్ధత చూసి ఆశ్చర్యపోయాను. సీరియస్‌గా ఉండటమే కాకుండా తన చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ పాజిటివ్ ఎనర్జీని పంచుతారు.
పెళ్లి తరువాత అమెరికాలో స్థిరపడిన నేను 2023లో ఇండియాకు వచ్చాను. కొన్ని యూట్యూబ్ చానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తున్న సమయంలోనే తమ్ముడు మూవీ టీమ్ నుంచి ఫోనొచ్చింది. నటిస్తారా అని అడిగితే ఒకే చెప్పాను. ఝాన్సీ పాత్ర కోసం బరువు పెరగాలని చెబితే స్వీట్స్ బాగా తిని 7 కిలోలు పెరిగాను. కోరుకున్నప్పుడు అవకాశాలు రావని, వచ్చిన అవకాశాలు వదులుకోవద్దని భావించి ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చాను. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేశాను.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

