నిర్మల్: నిర్మల్ జిల్లాలో(Nirmal )విషాదం చోటు చేసుకుంది. ఫ్రిడ్జి పేలి(Fridge Explodes) ఇద్దరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలోని బంగల్పేట్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో ఫ్రిడ్జి పేలిపోవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి వారిని ప్రభుత్వ దవాఖానకు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Earthquake | అల్లూరి జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం