ఖానాపూర్ టౌన్, జనవరి31: నేరాల కట్టడి కోసమే కార్డన్ సెర్చ్(Cordon search) నిర్వహిస్తున్నామని ఖానాపూర్ సీఐ సైదారావు అన్నారు. శుక్రవారం ఖానాపూర్ పట్టణంలోని(Khanapur town) గాంధీ నగర్ కాలనీలో సాయంత్రం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలో నెంబర్ ప్లేట్లు, సరైన సర్టిఫికెట్లు లేని పలు వాహనాలను పోలీసులు సీజ్‌చేశారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం ప్రజలను అప్రమత్తం చేయడమే అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ప్రయాణించే సమయంలో వాహనాల అన్ని సర్టిఫికెట్లను వెంట ఉంచుకోవాలన్నారు.
ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. కార్డెన్ సెర్చ్‌లో ఎస్ఐలు రాహుల్ గైక్వాడ్, కృష్ణ సాగర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ఇవి కూడా చదవండి..