నిర్మల్ : మొక్కజొన్నలు కొనుగోలు చేపట్టాలని నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండలం అర్లీ ఎక్స్ రోడ్డు వద్ద నిర్మల్-భైంసా రహదారిపై లోకేశ్వరం మండల రైతులు ఆందోళనకు దిగారు. గత వారం రోజులుగా ఇక్కడి కొనుగోలు కేంద్రంలో మక్కలు కొనడం లేదని, గన్ని బ్యాగులు ఇవ్వడం లేదంటూ రైతులు నిరసనకు దిగారు. కష్టపడి పంటలు పండిస్తే కొనే వారు లేక వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మక్కలు కొనుగోలు చేయాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Congress | మహిళా ఎమ్మెల్యేను హగ్ చేసుకునేందుకు పార్టీ నేత యత్నం