Farmer | రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రైతులు వడ్లు, మక్కలు అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాల్లో చాలా రోజులుగా నిరీక్షిస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం కదలడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనండి అంటూ రైతన్నలు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రోడ్డెక్కిన రైతన్నలు అధికారుల కాళ్లపై పడ్డా కనికరించడం లేదు.
నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహిస్తున్న లింగాపూర్ గ్రామానికి చెందిన రైతు ఆకుల నర్సయ్య ఎండకి తట్టుకోలేక స్పృహ కోల్పోయాడు. దీంతో ఆయన్ను తోటి రైతులు హుటాహుటిన ప్రైవేట్ వాహనంలో కడెం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ధాన్యం కొనమని అధికారుల కాళ్లు పట్టుకొని వేడుకుంటున్న ఓ రైతన్న వీడియో రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉందో మరోసారి అద్దం పడుతోంది.
ధర్నా చేస్తూ ఎండకి తట్టుకోలేక స్పృహ కోల్పోయిన రైతు
మరోవైపు ధాన్యం కొనమని అధికారుల కాళ్లు పట్టుకొని వేడుకుంటున్న రైతన్న
నిర్మల్ జిల్లా – కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ చౌరస్తా వద్ద నిర్వహిస్తున్న ధర్నా వద్ద ఎండకి తట్టుకోలేక స్పృహ కోల్పోయిన లింగాపూర్ గ్రామానికి చెందిన రైతు ఆకుల… https://t.co/cs9P8k5pxb pic.twitter.com/41tqks7HsK
— Telugu Scribe (@TeluguScribe) May 25, 2026