Nutritional Food | ఉట్నూర్ రూరల్, జూన్ 12: అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం సక్రమంగా అందించాలని మండల ప్రత్యేక అధికారి సుధాకర్ అన్నారు. గురువారం మండలంలోని గంగన్నపేట గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు క్రమం తప్పకుండా పౌష్టికారం అందించాలని అన్నారు.
పౌష్టికాహారం తీసుకుంటూనే పిల్లలు, గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. వర్షాకాలం ప్రారంభం అయినందున వ్యాధులు రాకుండా పరిశుభ్రత పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ గోమాస ఉమారాణి, ఎంఈఓ ఆశన్న, ఐసీడీఎస్ సూపర్ వైజర్ మంజులత, అంగన్వాడీ టీచర్ రత్నమాల, పిల్లలు ఉన్నారు.
Ahmedabad plane crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏపీ ప్రముఖుల దిగ్భ్రాంతి
Nidamanoor : భూ భారతితో భూములకు భద్రత : వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం
Surekha Vani | సురేఖా వాణి చేసిన పనికి తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్