Durgam Chinnaiah | తాండూర్, డిసెంబర్ 10 : సీఎం రేవంత్ రెడ్డి దుందుడుకు చర్యల వల్ల కాంగ్రెస్ సర్కారుపై రైతులు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. తాండూర్ మండలానికి చెందిన వివిధ పార్టీల నాయకులు మంగళవారం రాత్రి తాండూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దత్తాత్రేయ రావు నివాసంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దుర్గం చిన్నయ్య వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ.. బెల్లంపల్లి నియోజకవర్గంలో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో తాను చేసిన అభివృద్ధి మాత్రమే ప్రజలు గుర్తు చేస్తున్నారని, కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేమీలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు.
42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మోసం చేసిందన్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.


Fire accident | టెక్స్టైల్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన 20కి పైగా దుకాణాలు
Ramavaram : ప్రతి ఒక్కరు శాంతియుతంగా ప్రచారం కొనసాగించాలి : కొత్తగూడెం టూ టౌన్ సీఐ ప్రతాప్
Akhanda 2 | అఖండ 2 దెబ్బకి ఇన్ని సినిమాలు వాయిదా పడ్డాయా.. ఏకంగా రజనీకాంత్ చిత్రం కూడా..!