కాసిపేట, అక్టోబర్ 8 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో నామినేషన్ ఏర్పాట్లు చెక్ స్లిప్ ప్రకారం జడ్పీటీసీ ఎన్నికల అధికారి పురుషోత్తం నాయక్, తహసీల్దార్ సునీల్ కుమార్, ఎంపీడీవో సత్యనారాయణ సింగ్, ఎంపీటీసీ ఆర్వోలు రాథోడ్ రమేష్, సాంబమూర్తి, ఎంపీవో శేఖ్ సఫ్దర్ అలీ, డీటీ అంజయ్య పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సూపరిడెండెంట్ అల్లూరి లక్ష్మయ్య, సీనియర్ అసిస్టెంట్ ఆకుల లక్ష్మీ నారాయణ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Compensation | రోడ్డు ప్రమాదంలో భార్య మృతి.. 11 ఏళ్ల తర్వాత భర్తకు రూ.51 లక్షల పరిహారం..!
Shilpa Shetty | ముందు రూ.60 కోట్లు కట్టండి.. శిల్పా శెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు
Cough Syrup | మరో రెండు దగ్గు మందులను బ్యాన్ చేసిన తెలంగాణ ప్రభుత్వం