Sarpanch Elections | కాసిపేట, డిసెంబర్ 10 : కేసీఆర్ హయాంలోని అభివృద్ధిని చూసి సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కాసిపేట మండల మాజీ జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య, మాజీ ఎంపీటీసీ కొండబత్తుల రామచందర్ ప్రజలను కోరారు. బుధవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ మద్దతు తెలిపిన సర్పంచ్ అభ్యర్థి కల్వల శరత్ కోసం గ్రామంలో ప్రచారం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య, మాజీ ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించారని, అధిక పెన్షన్, అన్ని సదుపాయాలు కల్పించారని, తెలంగాణ కోసం నిత్యం ఆలోచించే బీఆర్ఎస్ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చింతల భీమయ్య, శ్రావణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Fire accident | టెక్స్టైల్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన 20కి పైగా దుకాణాలు
Ramavaram : ప్రతి ఒక్కరు శాంతియుతంగా ప్రచారం కొనసాగించాలి : కొత్తగూడెం టూ టౌన్ సీఐ ప్రతాప్
Akhanda 2 | అఖండ 2 దెబ్బకి ఇన్ని సినిమాలు వాయిదా పడ్డాయా.. ఏకంగా రజనీకాంత్ చిత్రం కూడా..!