Mission bhagiratha water | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేట్టిన ప్రాజెక్ట్ మిషన్ భగీరథ. తెలంగాణవ్యాప్తంగా ప్రతీ ఒక్కరికి తాగునీరందించాలనే గొప్ప సంకల్పంతో చేపట్టిన మిషన్ భగీరథ ఫలాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీరుగారిపోతున్నాయి. తాగడానికి నీరు లేక ఇబ్బంది పడుతోంది ఓ కుటుంబం.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని లంబాడీతండా(కే) గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక కుటుంబం కన్నీటి ఆవేదన అనుభవిస్తుంది. లంబాడీతండా(కే) గ్రామ పంచాయతీలోని బానోత్ తిరుపతి – సుమ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యభర్తలు ఇద్దరూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుటుంబం మిషన్ భగీరథ నీటిపై ఆధారపడి ఉండగా సుమారు గత 15 రోజుల పైగా నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
గ్రామంలో మంచినీటి చేతి బోరు ఉండగా దానిని తొలగించి ప్రైవేట్ కనెక్షన్లు పెట్టుకున్నారు. అయతే తిరుపతి-సుమ కుటుంబానికి డబ్బులు లేక సొంతగా నీటి కనెక్షన్ తీసుకోలేదు. ప్రస్తుతం వారు మిషన్ భగీరథ నీరు రాక, చేతి పంపు లేకపోవడంతో నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నీళ్ల కోసం కూలీ పనులు మానుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకుంటూ ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని లేదా చేతి పంపుని అందుబాటులోకి తెచ్చి తమ సమస్యను పరిష్కారం చేయాలని వేడుకుంటున్నారు.
పంచాయతీ కార్యదర్శికి చెప్పినా పట్టించుకోవడం లేదని, ఉన్నతాధికారులు తమ సమస్య పరిష్కారం చూపి నీటిని అందించాలని వేడుకుంటున్నారు.
Kumram Bheem | కుమ్రం భీం ఆశయ సాధనకు కృషి చేయాలి : బానోత్ గజానంద్
Chief Justice BR Gavai | చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి హేయమైన చర్య : గుణిగంటి మోహన్
Metpalli | సీజేఐపై దాడికి నిరసనగా విధుల బహిష్కరణ