KTR | ఎన్నికల ముందు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు రైతు డిక్లరేషన్ గురించి ఇచ్చిన అబద్ధపు హామీల వీడియోను ప్లే చేశారు. ఇచ్చిన ఒక్క హామీ అయినా అమలు చేశారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పంట కొనకపోవడం వల్ల గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక సాయం అందించారు. మే 6న లక్షెట్టిపేట మండలంలో పంటలు కాపాడుకునేందుకు వెళ్లి మృత్యువాత పడిన నలుగురు రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 20 లక్షల ఆర్థికసాయాన్ని అందించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఒక్కటే చిల్లర మాట మాట్లాడుతడు.. ఏ జాతి నీది అంటడు.. రేవంత్ రెడ్డి ఏ జాతో కూడా నీకు చెప్పాల్సిన టైం వచ్చింది. ఉద్యమం సమయంలో ఉద్యమకారుల మీదకి తుపాకీ తీసుకుపోయిన పోరంబోకు జాతి అయితే మాది కాదు.. వలస పాలకుల సంక నాకుతూ సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతి మాది కాదు.. తెలంగాణ తొలి ప్రభుత్వంలో రూ.50 లక్షలకు ఒక ఎమ్మెల్యే కొనాలని చూసి దొరికిపోయిన లుచ్చా జాతి అయితే మాది కాదు.. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద వందల కొద్దీ కేసులు వేసి ఆపాలని చూసిన దివానాగాళ్ల బ్యాచ్ అయితే మాది కాదు.. అబద్దాలు, విద్వేషాలు, బూతులతో ప్రజలను రెచ్చగొట్టి బతికిన చిల్లర జాతి మాది కాదన్నారు.
ప్రాజెక్టులను బాంబులతో పేల్చేసిన అథమ జాతి మాది కాదు.. నీళ్లున్నా ఇచ్చే వ్యవస్థ ఉన్నా జనాలకు అందించలేని అసమర్థ జాతి కాది మాది రేవంత్ రెడ్డి. ఉద్యోగాలు అడిగితే బావిలో దుంకుమని, ఎండ్రిన్ తాగుమని.. నీళ్లు అడిగితే రక్తం చల్లుకోమన్న రాక్షస మాటలు మాట్లాడే జాతి మాది కాదు.. అన్ని బాగు చేసి అప్పెజెప్పినా ప్రజారంజకంగా పరిపాలించకుండా వానికి వీనికి మూటలు మోసి జనాలను హింసించే రాక్షస నికృష్ట జాతి మాది.. తెలంగాణలో రెండే రెండు జాతులున్నాయి.. ఒకటి రాష్ట్రాన్ని ప్రేమించే జాతి, రాష్ట్రానికి ద్రోహం చేసే జాతి.. ఎవడిది ఏ జాతో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు.. ఎవరు తెలంగాణ తెచ్చిర్రో.. ఎవరు తెలంగాణను వంచిస్తున్నడో.. ఎవడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నడో..? అందరికీ తెలుసు.. అని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజమెత్తారు.
పోరంబోకు, లుచ్ఛా, నికృష్ట, దగుల్బాజీ జాతి నీది రేవంత్ రెడ్డి
మా జాతి ఏంది అని రేవంత్ రెడ్డి చిల్లరగా మాట్లాడుతున్నాడు
ఉద్యమకారుల మీదకి తుపాకీ తీసుకుపోయిన పోరంబోకు జాతి మాది కాదు
వలసపాలకుల సంక నాకుతూ సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతి మాది కాదు
తెలంగాణ తొలి ప్రభుత్వంలో… https://t.co/PSTYBtWUZ7 pic.twitter.com/30RTNIgylM
— Telugu Scribe (@TeluguScribe) July 21, 2026
ఎన్నికల ముందు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు రైతు డిక్లరేషన్ గురించి ఇచ్చిన అబద్ధపు హామీల వీడియో ప్లే చేసిన కేటీఆర్
ఇచ్చిన ఒక్క హామీ అయినా చేశారా?
– కేటీఆర్ pic.twitter.com/5NUxjXZYXb
— Telugu Scribe (@TeluguScribe) July 21, 2026
Watch: జిప్‌లైన్ సేఫ్టీ లాక్ ఫెయిల్.. 40 అడుగుల ఎత్తు నుంచి కింద పడిన టూరిస్ట్
Health News | రోజుకు 5 కప్పుల వరకు కాఫీ తాగడం సురక్షితమే.. తాజా అధ్యయనంలో వెల్లడి..!