Fertilizers | తాండూర్, జూన్ 23: తాండూర్ మండల రైతాంగానికి సరిపడా ఎరువులు జిల్లా వ్యవసాయాధికారులు సమకూర్చాల్సిందిగా పీఏసీఎస్ చైర్మన్ సుబ్బ దత్తుమూర్తి కోరారు. తాండూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సోమవారం సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించి పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా దత్తుమూర్తి మాట్లాడుతూ.. తాండూర్ మండలానికి 60 మెట్రిక్ టన్నుల ఎరువులు కావాలని అడిగితే కేవలం 12 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారన్నారు. దీంతో ఎరువులను రైతులకు పంచడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.
ప్రతీ రైతుకు రెండు బ్యాగులు ఇస్తున్నా వారు అదనంగా బ్యాగులు కావాలని ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. ఈ ప్రాంత రైతుల పరిస్థితి అర్ధం చేసుకొని రైతులందరికి అందే విధంగా ఎక్కువ మోతాదులో పంపించాలని అధికారులను కోరారు. అలాగే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్పీవో)లో భాగంగా సంఘంలోని ప్రతీ రైతు రూ. 2వేలు చెల్లించి సంఘంలో సభ్యత్వం తీసుకోవాలని కోరారు.
సభ్యత్వము పొందిన వారికి సంఘం ద్వారా జరిగే వ్యాపారంలో రాయితీ పొందవచ్చునని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు కడారి రత్నాకర్ రావు, డైరెక్టర్లు గట్టు మురళీధర్ రావు, మాసాడి తిరుపతి, పూసాల రాజేశం, ఎంఏ రవూఫ్, సీఈవో శ్రీనివాస్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Alumni | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. పాతికేళ్ల తర్వాత పూర్వ విద్యార్థులంతా కలిశారు
Rayaparthi | వ్యవసాయ భూములకు వెళ్లే బాట కబ్జా.. కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన
Suryapet | కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహకారం అవసరం : జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన