Farmers Strike | హజీపూర్, సెప్టెంబర్ 9 : మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో యూరియా కొరతపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతీయ -రహదారిపై ధర్నా నిర్వహించారు. పడ్తనపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో యూరియా కోసం 15 రోజులుగా ఎదురు చూస్తుంటే సరిపడా సప్లయ్ చేయడం లేదని జాతీయ -రహదారిపై మంగళవారం రైతులు బైఠాయించి ధర్నా చేపట్టారు. రైతులు ఆగ్రహంతో జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. యూరియా కావాలని రోడ్డుఫై కూర్చొని నిరసన తెలిపారు. రైతులు ధర్నా చేయడంతో రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
యూరియా ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక ఎస్ఐ స్వరూప్ రాజ్ అక్కడికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మండల వ్యవసాయ అధికారి రావాలి.. కలెక్టర్ రావాలి అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏవో అక్కడికి చేరుకొని సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి పంపిణీ చేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
తెల్లవారుజాము నుంచే యూరియా కోసం..
వ్యవసాయ పనులన్నీ వదులుకుని యూరియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సరిపడా బస్తాలు ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు. ఆనాటి రోజులు, అవే అవస్ధలు మళ్లీ వచ్చాయి. ఇదేమి ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తెల్లవారుజాము నుంచే యూరియా కోసం నిల్చున్నామని, అయినా యూరియా ఇవ్వడం లేదని విమర్శించారు.పదేళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
వరి పంటకు యూరియా వేయకపోతే దిగుబడి తగ్గుతుందని, పంటలు ఎర్రబారుతాన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పనులు మానుకొని 15 రోజులుగా యూరియా కోసం ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.కాగా పడ్తనపల్లి PACS కు మంగళవారం యూరియా వస్తదని తెలుసుకున్న రైతులు తమ ఆధార్ కార్డులు, చెప్పులను క్యూలో ఉంచారు. సాయంత్రం అయినా యూరియా రాకపోవడంతో రైతులు నిరాశతో ఇంటికి వెళ్లిపోయారు.
Nepal | ఆగని ఆందోళనలు.. ఓలి రాజీనామాకు డిమాండ్.. మాజీ ప్రధాని ఇంటిని ధ్వంసం చేసిన నిరసనకారులు
BRS | రైతులకు సరిపడా యూరియా అందించండి.. కాల్వశ్రీరాంపూర్‌లో బీఆర్ఎస్ రాస్తారోకో
Aishwarya Rai | AIతో అశ్లీల కంటెంట్.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్య రాయ్