Nepal | నేపాల్ (Nepal)లో రెండోరోజూ నిరసనలు కొనసాగుతున్నాయి. సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ ఆ దేశ యువత (student led protests) చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. వేలాంది మంది జనరేషన్ జెడ్ ఆందోళనకారులు (Gen Z protests) సోమవారం దేశ రాజధాని కాఠ్మాండు (Kathmandu)లో చేపట్టిన ఉద్యమం రణరంగాన్ని తలపించింది. అయితే, పరిస్థితి చేయి దాటిపోయిందని గ్రహించిన ప్రభుత్వం చివరికి సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తేసింది. అయినప్పటికీ నిరసనలు చల్లారట్లేదు.
వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నేపాల్ మాజీ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ ఇంటిని నిరసనకారులు ధ్వంసం చేశారు. పలువురు మంత్రులు, నేతల ఇండ్లపై రాళ్లు రువ్వారు. ఈ నిరసనలతో అప్రమత్తమైన అధికారులు రాజధాని కాఠ్మాండూ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ విధించారు.
వేలాది మంది యువత ఇవాళ తెల్లవారుజామున నుంచే రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. రోడ్లను దిగ్బంధించారు. టైర్లను తగలబెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నానాదాలు చేశారు. ‘ప్రభుత్వంలోని హంతకులను శిక్షించండి. పిల్లలను చంపడం ఆపండి. అవినీతి నాయకులపై చర్యలు తీసుకోండి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధాన మంత్రి కేపీ ఓలి (Nepal PM KP Oli) తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.
మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. యువత ఉద్యమంతో ఇప్పటికే పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రధాని కేపీ ఓలి కూడా దేశం విడిచి పారిపోయేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయన దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఉప ప్రధానికి అదనపు బాధ్యతలు కూడా అప్పగించినట్లుగా సమాచారం.
Also Read..
Nepal | నేపాల్‌లో రాజకీయ సంక్షోభం..? మంత్రుల రాజీనామా.. దుబాయ్‌కి ప్రధాని ఓలి..!
Nepal | రణరంగంగా నేపాల్.. భారతీయులకు కీలక అడ్వైజరీ
Social Media Ban | వెనక్కి తగ్గిన నేపాల్ సర్కార్.. సోషల్ మీడియా నిషేధం ఎత్తివేత