కాల్వ శ్రీరాంపూర్, సెప్టెంబర్ 9: రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ కాల్వ శ్రీరాంపూర్‌లో బీఆర్ఎస్ (BRS) శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్ర వీడి రైతులకు సరిపడా యూరియా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగుపడదని శాపనార్థాలు పెట్టారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసిల్దార్ జగదీశ్వరరావుకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ జెడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, నాయకులు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘ సంఘం నాయకులు పాల్గొన్నారు.