Durgam Chinnaiah | తాండూర్, డిసెంబర్ 11 : కేసీఆర్ హయాంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రజలను కోరారు.
గురువారం మంచిర్యాల జిల్లా తాండూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ మద్దతు తెలిపిన సర్పంచ్ అభ్యర్థి దుర్గం గంగారాం కోసం
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని వివరించి బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం గంగారాం బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించారని, అధిక పెన్షన్, అన్ని సదుపాయాలు కల్పించారని అన్నారు. తెలంగాణకు రక్ష బీఆర్ఎస్ అని, తెలంగాణ కోసం నిత్యం ఆలోచించే బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

e-cigarette: పార్లమెంట్లో ఈ-సిగరేట్ తాగిన టీఎంసీ ఎంపీ.. బీజేపీ ఆరోపణలు
Fire Accident | మంచిర్యాలలో ఇంటిపై అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
Panchayat Polling | ముగిసిన తొలి విడుత పోలింగ్.. కొద్దిసేపట్లో మొదలుకానున్న కౌంటింగ్..