న్యూఢిల్లీ: పార్లమెంట్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ.. సభా పరిసరాల్లోనే ఈ-సిగరేట్(e-cigarette) తాగినట్లు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. లోక్సభలో ఆయన ఈ విషయాన్ని స్పీకర్ ఓం బిర్లా ముందు ప్రస్తావించారు. అయితే ఆ ఈ-సిగరేట్ తాగిన వ్యక్తిపై చర్యలు తీసుకోనున్నట్లు స్పీకర్ బిర్లా పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సప్లిమెంటరీ అడిగిన సమయంలో బీజేపీ ఎంపీ ఆ విషయాన్ని గుర్తు చేశారు. సభలో ఈ-సిగరెట్లకు అనుమతి ఉందా అని ఎంపీ అనురాగ్.. స్పీకర్ బిర్లాను అడిగారు. లేదు అని ఆయన సమాధానం ఇచ్చారు.
అయితే గత కొన్ని రోజుల నుంచి టీఎంసీ ఎంపీ సభలో ఈ-సిగరేట్ తాగుతున్నట్లు ఎంపీ ఠాకూర్ ఆరోపించారు. ఆ ప్రతిపక్ష ఎంపీపై చర్యలు తీసుకోవాలని అనేకమంది బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. భారీగా నినాదాలు రావడంతో.. సభ్యుల్ని స్పీకర్ బిర్లా శాంతపరిచారు. హుందాగా వ్యవహరించాలన్నారు.ఒకవేళ ఏదైనా లిఖితపూర్వక ఫిర్యాదు నమోదు చేస్తే, అప్పుగు ఆ ఎంపీపై చర్యలు తీసుకుంటానన్నారు. కొన్నేళ్ల క్రితమే ఇండియాలో ఈ-సిగరేట్లను నిషేధించారు. అయితే సోషల్ మీడియా పుకార్ల ప్రకారం.. టీఎంసీ మహువా మైత్రి.. పార్లమెంట్లో ఈ-సిగరేట్లు తాగుతున్నట్లు తెలిసింది.
आज संसद में-
मुद्दा तो गंभीर है, अनुराग ठाकुर का कहना है की संसद के अंदर एक TMC सांसद e-cigarette पी रहे हैं।
स्पीकर ओम बिरला ने कहा की कारवाही होगी इस पर। pic.twitter.com/7Acfrnvz7E— Aishwarya Paliwal (@AishPaliwal) December 11, 2025