Malaika Arora | రోమ్‌లో మలైకా–హర్ష్ సెల్ఫీ వైరల్ .. కొత్త రిలేషన్‌తో ఊపందుకున్న చర్చలు
Malika Arora | బాలీవుడ్ నటి మలైకా అరోరా వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లోకి వచ్చింది. నటుడు అ్తర్జున్ కపూర్‌తో బ్రేకప్ అనంతరం ఆమె డైమండ్ వ్యాపారి హర్ష్ మెహతాతో రిలేషన్షిప్లో ఉన్నారనే వార్తలు గత ఏడాది వినిపించాయి. వీరిద్దరూ పలు సందర్భాల్లో కలిసి కనిపించడం కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చింది.
Malika Arora | బాలీవుడ్ నటి మలైకా అరోరా వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లోకి వచ్చింది. నటుడు అ్తర్జున్ కపూర్‌తో బ్రేకప్ అనంతరం ఆమె డైమండ్ వ్యాపారి హర్ష్ మెహతాతో రిలేషన్షిప్లో ఉన్నారనే వార్తలు గత ఏడాది వినిపించాయి. వీరిద్దరూ పలు సందర్భాల్లో కలిసి కనిపించడం కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. ఇప్పుడు తాజాగా వీరిద్దరూ కలిసి తీసుకున్న ఒక సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ రెడిట్ యూజర్ ఈ ఫొటోను షేర్ చేయడంతో అది నెట్టింట చర్చనీయాంశమైంది. ఈ ఫొటో ఇటలీలోని రోమ్‌లో తీసుకున్నదని ప్రచారం జరుగుతోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా మలైకా, హర్ష్ కలిసి అక్కడ వేడుకలు జరుపుకున్నారని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఫొటోలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
అయితే అందరూ ఒకే అభిప్రాయంతో లేరు. కొందరు రెడిట్ యూజర్లు ఈ ఫొటోపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. “ఇది పబ్లిక్ రిలేషన్స్ కోసం తీసిన ఫొటోలా ఉంది. వీళ్లిద్దరూ కలిసి ఉన్నారని చూపించడానికి ప్లాన్ చేసి తీసినట్లుంది” అంటూ ఒకరు వ్యాఖ్యానించారు. మరో యూజర్ “స్టూడియో లైట్స్ ఉన్నట్లుగా ఎందుకు కనిపిస్తోంది? ఇది ఫొటోషూట్ లేదా ప్రమోషన్ కోసమా?” అని ప్రశ్నించారు. ఇంకొక నెటిజన్ వయసు తేడా అంశాన్ని ప్రస్తావిస్తూ, “ఈ బంధంలో వయసు తేడా గురించి ఎవరూ మాట్లాడరా? ఆమె చిన్నవాళ్లతో డేటింగ్ చేయడంలో నాకు సమస్య లేదు. కానీ ఇక్కడున్న హిపోక్రసీని చూపిస్తున్నాను” అని రాశారు.
తాజా సమాచారం ప్రకారం మలైకా వయసు 52 ఏళ్లు కాగా, హర్ష్ వయసు 33 ఏళ్లు. అంటే ఇద్దరి మధ్య దాదాపు 19 ఏళ్ల వయసు తేడా ఉంది. గతంలో అర్జున్ కపూర్‌తో రిలేషన్లో ఉన్నప్పుడు కూడా మలైకా ఆయన కంటే 12 ఏళ్లు పెద్దవారే. ఆ బంధంపై ఆమె ఎప్పుడూ ఓపెన్‌గా మాట్లాడేవారు. కాగా, మలైకా, హర్ష్‌తో బంధంపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందువల్ల ఈ కొత్త రిలేషన్‌షిప్‌పై స్పష్టత రావాలంటే ఆమె స్పందన కోసం వేచి చూడాల్సిందే. ఇక ఇదిలా ఉంటే, బ్రేకప్ తర్వాత కూడా మలైకా, అర్జున్ స్నేహపూర్వకంగా ఉంటున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి, రోమ్ సెల్ఫీతో మలైకా వ్యక్తిగత జీవితం మళ్లీ చర్చల్లోకి వచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- arbaz khan
- bollywood
- dating
- Harsh
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

