Fire Accident | మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 11: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌతమి నగర్లో గల టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఇంటి పైన ఉన్న రేకుల షెడ్డులో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటిపైన ఒకేసారి పేలుడు సౌండ్ వినపడిందని.. దీంతో వెంటనే పొగ చెలరేగి మంటలు అంటుకోగా.. అగ్నిమాప శాఖ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారన్నారు.
వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. ఈ ప్రమాదంపై స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రమేష్ బాబును వివరణ కోరగా గదిలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఏసీ పేలడంతో మంటలంటుకున్నాయని, అందులో ఉన్న పాలు సామాగ్రి అగ్నికి ఆహుతైందని తెలిపారు. వాటి విలువ దాదాపు రూ. రెండున్నర లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందన్నారు.
సహాయక చర్యల్లో ఫైర్ సిబ్బంది రమేష్ బాబు, రాజేందర్, రమేష్ శ్రీకాంత్, రమేష్, పోలీస్ సిబ్బంది తిరుపతి, రాకేష్ ఉన్నారు.


Fire Accident3