CPI | జన్నారం, జనవరి 6 : సీపీఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఈ నెల 18వ తేదీన నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతూ మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో ప్రధాన రోడ్డుపై సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్ స్టాండ్ ఎదుట పాటలు పాడి ప్రజలను చైతన్యం చేశారు.
ఈ సందర్బంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేని శంకర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు కలెందర్ అలీఖాన్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ పార్టీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై పోరాటం చేసే పరిష్కరించే పార్టీని ప్రజలు ఎప్పటికీ గుండెలకు హత్తుకుంటారన్నారు. చలో ఖమ్మం సభకు సీపీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.