అమరావతి : వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా సెల్వమణి (Former Minister Roja) ఏపీకి చెందిన అధికారులను హెచ్చరించారు. వైసీపీ (YCP ) ధికారంలోకి వస్తుందని అప్పుడు కూటమికి సహకరిస్తున్న అధికారులందరూ పదింతలు మూల్యం చెల్లించక తప్పదని ఘాటుగా వ్యాఖ్యనించారు. నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ( Pinnelli Ramakrishna reddy ) , వెంకట రాంరెడ్డిని పరామర్శించారు. జైలు బయట ఆమె మీడియాతో మాట్లాడారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ జైలులు పెడుతుందని, రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన కొనసాగుతుందని ఆరోపించారు. 16 నెలల కాలంలో 16 మందిపై కేసులు వేసి వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. చేయని తప్పుకు పిన్నెల్లి సోదరులను జైలులో పెట్టించి కోర్టు ఆదేశాలను సైతం పక్కనపెట్టి సక్రమంగా భోజనం అందించడం లేదని పేర్కొన్నారు.
తాము అధికారంలోకి ( వైసీపీ ) అన్నీ తిరిగి ఇస్తామని వెల్లడించారు. పోలీసు వ్యవస్థ ఖాకీ చొక్క బదులు పచ్చ చొక్కా వేసుకుని తిరుగుతుందని దుయ్యబట్టారు. రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిస్తుందని, మహిళలపై దౌర్జన్యాలు, హత్యల వల్ల రాష్ట్రం పరువు పోతుందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నేర నివేదికలో ఏపీకి 31వ ర్యాంకు ఇచ్చిందని, దీన్నిబట్టి రాష్ట్రంలో నేరాల పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుందని వ్యాఖ్యనించారు.