BRSV | తాండూర్, సెప్టెంబర్ 16 : పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు, తాండూరు మండలంలో జూనియర్ కళాశాల మంజూరు చేయకపోతే రానున్న ఎలక్షన్లో విద్యార్థుల శక్తి ఏంటో చూపిస్తాం అని తాండూరు మండల కేంద్రం ఐబిలో జాతీయ రహదారిపై బీఆర్ఎస్వీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ అద్వ్యర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా బడికల శ్రావణ్ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు నష్టపోతున్నారని, విద్యార్థులు తల్లిదండ్రులు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఉందని అలాంటి విద్యార్థులు మేనేజ్మెంట్ ఫీజులు భరించకపోవడం వల్లనే స్కాలర్షిప్ పై ఆధారపడి ఎంతోమంది విద్యార్థులు చదువుకుంటున్నారని అన్నారు.ఎస్సి, ఎస్టీ,బీసీ,మైనార్టీ విద్యార్థుల స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను అరిగోసలు పెడుతున్నారని ఆరోపించారు.
అదేవిధంగా ఇంటర్, ఉన్నత విద్యాసంస్థలైనటువంటి డిగ్రీ, పిజీ ఎంబీబీఎస్, ఎంబీఏ, ఫార్మసీ, బిఈడి, ఇంజనీరింగ్ విద్యాసంస్థలు, వృత్తి విద్య కోసం సంబంధించిన విద్యాసంస్థలు అన్ని కూడా ఏక తాటిపైకి వచ్చి స్కాలర్షిప్ విడుదల అయ్యేంతవరకు కళాశాలలు మూసివేస్తామని చెప్తున్నారని పేర్కొన్నారు. అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది అని దుయ్యబట్టారు. అంతేకాకుండా విద్యార్థులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఇక్కడ ఎన్నికల సమయంలో తాండూరు మండలానికి జూనియర్ కళశాల తీసుకువస్తాను అని మాయ మాటలు, అబద్దపు హామీ ఇచ్చి మరిచిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఇప్పటి వరకు కళాశాల మాట ఎత్తకపోవడం వలన ఈ మండలంలోని ఎంతో మంది విద్యార్థులు ఇంటర్ విద్యకు దూరం అవుతున్నారని తెలిపారు.
ఎంతో మంది పేద విద్యార్థుల చదువుకు దూరం అయి ఎటు కాకుండా పోతున్నారు అని వారు ఆవేదన చెందారు. వెంటనే ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఇచ్చిన హామీ మేరకు జూనియర్ కళశాల ప్రారంభించక పోతే నియోజకవర్గ వ్యాప్తంగా పెద్దఎత్తున దశలవారీగా కార్యక్రమాలు నిర్వహించి, జిల్లాలో ఉన్న ప్రతి ప్రభుత్వ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, అదే విధంగా రానున్న ఎలక్షన్ లో విద్యార్థుల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి తాండూరు మండల అధ్యక్షుడు శ్రీకాంత్, బెల్లంపల్లి పట్టణ బీఆర్ఎస్వి అధ్యక్షుడు ఆడెపు అరుణ్, సీనియర్ నాయకుడు జాడి పోశం, కిష్టఫర్, అడువాల సత్యనారాయణ, చింటూ, కాటం రాకేష్, రిజ్వన్, చోదన్, ప్రశాంత్, సరిష్, అక్రం, జుబేర్, ఇమానుఎల్, కైఫ్, రంజిత్, శివ శంకర, చరణ్, వినయ్, కుమార్, బీఆర్ఎస్వి కార్యకర్తలు పాల్గొన్నారు.
Miyapur | మియాపూర్ డిపోలో విషాదం.. గుండెపోటుతో కండక్టర్ మృతి
KTR | రాజ్యాంగంపై, సుప్రీంకోర్టుపై బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదు : కేటీఆర్
Powerhouse OST | రజినీకాంత్ ‘కూలీ’ నుంచి ‘పవర్హౌస్’ ఓఎస్టీ విడుదల