School | మందమర్రి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను, ప్రైవేట్ పాఠశాలల అనియమాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) నేతలు బుధవారం మండల విద్యా వనరుల కేంద్రంలో మండల విద్యాధికారి దత్తు మూర్తికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ .. మందమర్రి మండలంలోని 49 ప్రభుత్వ పాఠశాలలు,28 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నా ప్రభుత్వం నడిపే పాఠశాలల్లో అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు.
ఇక ప్రైవేట్ పాఠశాలల విషయానికి వస్తే, వారు యథేచ్ఛగా ఫీజులు వసూలు చేయడం,యూనిఫాం,పుస్తకాలు తమ వద్ద నుంచి మాత్రమే కొనాలంటూ నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు జారీ చేయడం పేద విద్యార్థులను వేధించటం వంటి చర్యలు తక్షణమే నియంత్రించాలని డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్నాయి.మరోవైపు ప్రభుత్వ పాఠశాలలు కనీస వసతులు లేక విద్యార్థులకు కష్టాలు తప్పట్లేదు. ఈ సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు హెచ్చరించారు.
అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల బలోపేతం, ప్రైవేట్ పాఠశాలలపై నియంత్రణ చర్యల కోసం సంబంధిత శాఖలకు నివేదిక అందజేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు ఎం.డి ముస్తాఫ్ఫా,బట్టు రాజ్ కుమార్, తోట సురేందర్,ముల్కల రమేష్,సీపెళ్లి సాగర్,మాసు వెంకటేష్,శనిగారపు అరుణ్, బోరిగం ముఖేష్, అభి, వంశీ, చారి తదితరులు పాల్గొన్నారు.
High Court | మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి : తెలంగాణ హైకోర్టు ఆదేశం
Gupta Nidhulu | గుప్తనిధుల కోసం ఆంజనేయ స్వామి ఆలయంలో తవ్వకాలు
cricket tournament | యువత క్రీడల్లో రాణించాలి.. క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన చల్మెడ