cricket tournament | వేములవాడ, జూన్ 25: యువత క్రీడల్లో రాణించాలని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. పట్టణానికి చెందిన 17వార్డు మాజీ కౌన్సిలర్ ముద్రకోల వెంకటేశం ఆధ్వర్యంలో ఐబీపీ గ్యాస్ గోదాం మైదానంలో బుధవారం ఏర్పాటుచేసిన ముద్రకోల వెంకన్న ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను చల్మెడ లక్ష్మీనరసింహారావు టాస్ వేసి ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రీడల్లో రాణించి వారి ప్రతిభ చాటుకోవాలన్నారు. యువతను ప్రోత్సహించి ఇలాంటి టోర్నమెంట్ ను నిర్వహిస్తున్న నిర్వాహకులు మాజీ కౌన్సిలర్ ముద్రకోల వెంకటేశం ను ఆయన అభినందించారు. అనంతరం చల్మెడ లక్ష్మీనరసింహారావు ను నిర్వాహకులు, క్రీడాకారులు శాలువాతో సత్కరించి సన్మానించారు. మూడు రోజులపాటు జరిగే ఈ టోర్నమెంట్లో 17వ వార్డు నుండి నాలుగు జట్లు పాల్గొంటున్నాయని శుక్రవారం ఫైనల్ జరుగనున్నట్లు టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు, మాజీ కౌన్సిలర్ లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, జోగిని శంకర్, సిరిగిరి రామచందర్, గోలి మహేష్, నాయకులు కొండ కనుకయ్య, అంజద్ పాషా, సందీప్, పర్వేజ్, గణేష్, రాకేష్, గోసుకుల రవి, మల్లేశం, శ్రీనివాస్ రెడ్డి, టోర్నమెంట్ నిర్వాహకులు వడ్లురి విష్ణు, మిరియాల సంతోష్, కందుకురు తారక్, శీలం విజయ్ యాదవ్, మద్దినేని హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.