Gupta Nidhulu | అలంపూర్, జూన్ 25 : మానవపాడు మండల పరిధిలో పురాతన ఆంజనేయ స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. మనోపాడు, చెన్నుపాడు గ్రామాల మధ్య పంట పొలాల్లో రోడ్డు పక్కన ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. బుధవారం అమావాస్య కావడంతో భక్తులు ఆలయంలో పూజ నిర్వహించడానికి వెళ్లగా అక్కడ పరిస్థితిని గమనించి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన విషయాన్ని పోలీసులకు చేరవేశారు.
మానవపాడు ఏఎస్ఐ ఆంజనేయులు సిబ్బందితో వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గర్భాలయం పక్క భాగం నుండి దుండగులు తవ్వకాలు చేపట్టినట్టు గుర్తించారు. అయితే గుప్తనిధుల కోసం చేపట్టిన తవ్వకాలు అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించారు. దుండగులు చేతకాక మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయినట్లు గమనించారు.
ఆలయంలో ఎటువంటి వస్తువులు గానీ విగ్రహాలు గానీ ధ్వంసం కాలేదని భక్తులు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అతి పురాతన ఆలయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పురాతన ఆలయాలను కాపాడుకొని భావితరానికి అందించాల్సిన బాధ్యత మనందరిపై ఎంతైనా ఉంది.
High Court | మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి : తెలంగాణ హైకోర్టు ఆదేశం
Gupta Nidhulu | గుప్తనిధుల కోసం ఆంజనేయ స్వామి ఆలయంలో తవ్వకాలు
cricket tournament | యువత క్రీడల్లో రాణించాలి.. క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన చల్మెడ