సారంగాపూర్ : నిర్మల్ జిల్లా బీర్పూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి రాజ్ కుమార్ శనివారం పెస్టిలైజర్స్(Fertilizer stores) ఎరువుల దుకాణాలను తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో యూరియా స్టాక్ వివరాలు, గొడౌడ్స్ని తనిఖీ చేశారు. ఎరువుల డీలర్లు ఎంఆర్పీ ధరలకే(MRP) ఎరువులను అమ్మాలన్నారు. అలాగే స్టాక్ వివరాలు తెలిసేలా షాప్లో బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులకు తప్పకుండా రశీదు ఇవ్వాలని, స్టాక్ రిజిస్టర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. ఎవరైనా డీలర్లు ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు ఎరువుల విక్రయించినట్టు తెలిస్తే లైసెన్సు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..