99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికను పక్కాగా అమలు చేయాలి
99 రోజుల ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ను జీహెచ్ఎంసీలో రిజల్ట్ ఓరియెంటెడ్‌గా అమలు చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రత్యేకాధికారి జయేష్ రంజన్ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. సోమవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో జయేష్ రంజన్ అధ్యక్షతన మొట్టమొదటి జీహెచ్ఎంసీ కార్పొరేషన్ సమావేశం జరిగింది. గత జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో తీర్మానించిన 30 అంశాలపై చర్చించి జీహెచ్ఎంసీ కార్పొరేషన్ కమిటీ అమోదం తెలిపింది.
- ప్రత్యేక అధికారి జయేష్ రంజన్ ఆదేశాలు
- ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహణ
- తొలి జీహెచ్ఎంసీ కార్పొరేషన్ సమావేశంలో 30 అంశాలకు ఆమోదం
సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ ) : 99 రోజుల ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ను జీహెచ్ఎంసీలో రిజల్ట్ ఓరియెంటెడ్‌గా అమలు చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రత్యేకాధికారి జయేష్ రంజన్ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. సోమవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో జయేష్ రంజన్ అధ్యక్షతన మొట్టమొదటి జీహెచ్ఎంసీ కార్పొరేషన్ సమావేశం జరిగింది. గత జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో తీర్మానించిన 30 అంశాలపై చర్చించి జీహెచ్ఎంసీ కార్పొరేషన్ కమిటీ అమోదం తెలిపింది.
అనంతరం మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రణాళికపై అధికారులకు జయేష్ రంజన్ దిశా నిర్దేశం చేశారు. 14 వారాల పాటు జరగనున్న ఈ కార్యక్రమం ఒకో వారం ఒకో థీమ్‌తో జరగనుందని వివరించారు. పారిశుధ్యంతో మొదటి వారం ప్రారంభమై విద్య, వైద్యం, మహిళా, రైతు, యువత, పర్యావరణం తదితర థీమ్‌లతో జరగనుందన్నారు. మొదటి వారం పారిశుధ్యం పేరుతో జరిగే కార్యక్రమంలో గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లపై ప్రత్యేక దృష్టి సారించి తొలగించాలన్నారు. ఇష్టారీతిన చెత్తను వేసే వారిపై జరిమానాలు విధించడం, ఈ – వేస్ట్ సేకరణ వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రభావంతంగా చేపట్టాలన్నారు. యూత్ వీక్‌లో యువతలో నైపుణ్యాల అభివృద్ధి పెంపొందించే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. యాంటీ డ్రగ్ చైతన్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

