Yarlagadda Venkateswara rao | పాతికేండ్ల కుర్రాళ్లు కూడా పది అడుగులు వేయడానికి ఆయాసపడుతున్న ఈ రోజుల్లో.. 66 ఏండ్ల యార్లగడ్డ వెంకటేశ్వరరావు ఆడుతూ పాడుతూ రోజూ 30 కిలోమీటర్లు పరుగులు తీస్తారు. పరుగు కోసమే ఉద్యోగం వదులుకున్నారు. మారథాన్ వీరుడిగా ఎన్నో పతకాలను ముద్దాడారు.
భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని బూట్‌క్యాంప్‌లో ఉంటారు వెంకటేశ్వరరావు. పుట్టింది గుంటూరు జిల్లా రేపల్లె. 1987లో ఖమ్మం వచ్చారు. ఖమ్మం జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంత కళాశాలల్లో అధ్యాపకుడిగా పనిచేశారు. పరుగు మీద ఆసక్తితో సర్వీస్ పూర్తికాకముందే ఉద్యోగానికి రాజీనామా చేశారు. శారీరక ఆరోగ్యానికి మారథాన్ పరుగును మార్గంగా ఎంచుకున్నారు వెంకటేశ్వరరావు. 1996 నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టారు. తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలన్న ఆలోచనతో.. అందరూ చేస్తున్న వాకింగ్‌కు భిన్నంగా మారథాన్ రన్లో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. వివిధ రాష్ర్టాల్లో జరిగిన మారథాన్ పోటీలకు వెళ్లి పతకాలను కైవసం చేసుకున్నారు. 2014లో ఢిల్లీలో జరిగిన 50 కిలోమీటర్ల మారథాన్ పరుగులో 5 గంటల్లోనే లక్ష్యాన్ని అందుకొని ‘ఔరా!’ అనిపించుకున్నారు. గడిచిన పదేండ్లలో రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున రమారమి లక్ష కిలోమీటర్లు పరుగు తీశారు. రానున్న ఐదేండ్లలో మరో యాభై వేల కిలోమీటర్లు పరుగెత్తడమే తన లక్ష్యమని అంటున్నారు వెంకటేశ్వరరావు. యోగాసనాలు వేయడంలోనూ ఆయన దిట్ట. ఢిల్లీలో సూర్యయోగా కూడా నిర్వహించారు. ‘నా భార్య కూడా ఉద్యోగి. పిల్లలూ సెటిల్ అయ్యారు. బతికున్నంత వరకు పరుగు ఆగకూడదన్నదే నా లక్ష్యం’ అంటున్నారాయన.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నది నా ఆకాంక్ష. నేను ఎన్నో మారథాన్లలో పాల్గొన్నాను. పతకాలు సాధించాను. మారథాన్ ద్వారా వచ్చిన ప్రతి పైసా పేదల కోసమే ఖర్చు చేస్తున్నాను. దుమ్ముగూడం మండలం సీతానగరం వద్ద పేదలకు ఏటా సాయం చేస్తాను. జీవితానికి ఇంతకు మించిన సార్థకత ఉండదు.
– యార్లగడ్డ వెంకటేశ్వరరావు
✍ కాగితపు వెంకటేశ్వరరావు
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
shaik saleema | తెలంగాణలో తొలి ముస్లిం ఐపీఎస్‌గా షేక్ సలీమా రికార్డ్.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదీ..
Saami Saami | పుష్పలో సామీ సామీ పాట పాడిన మౌనికకు ఇన్స్పిరేషన్ ఈమెనే
పుష్పలో సామీ సామీ పాట పాడే అవకాశం మౌనిక యాదవ్‌కు ఎలా వచ్చిందంటే..
విదేశాలకూ తెలంగాణ రుచులను అందిస్తున్న కరీంనగర్ మహిళలు
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
sheela bajaj | 78 ఏండ్ల వయసులో వ్యాపారం మొదలుపెట్టిన బామ్మ
వైకల్యం వారి ప్రతిభకు అడ్డం కాలేదు.. మోడలింగ్‌లో దూసుకెళ్తున్న కేరళ యువతులు
పిల్లలను ఎప్పుడు స్కూల్‌కు పంపించాలి.. విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ స్వీయ అనుభవం ఏంటంటే..