Online shopping | మొదటి లాక్డౌన్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఆ సమయంలోనే ఆన్లైన్ షాపింగ్ వ్యసనంగా మారింది. నెలకు ఐదారు వేలు వాటికే ఖర్చవుతున్నాయి. ఇంట్లో వాళ్లు వద్దని చెబుతున్నా, ఆఫర్స్ చూడగానే మనసు ఆగడం లేదు. నన్ను నేను నియంత్రించుకోలేక పోతున్నాను. ఈ ఏడాది నుంచి అయినా షాపింగ్ అలవాటు మానేయాలని అనుకుంటున్నాను. నాకు మీరే పరిష్కారం చూపాలి. – ఓ సోదరి
జ: చేతిలోని డబ్బంతా ఖర్చు చేసుకుంటూ పోతే, అవసరం వచ్చినప్పుడు చిల్లిగవ్వ కూడా ఉండదు. ఇప్పటికైనా ఖర్చు తగ్గించుకోవాలన్న మీ నిర్ణయం సంతోషకరం. సాధారణంగా అందరూ పాటించే సూత్రం.. రాబడి-ఖర్చు-ఆదా. అంటే, సంపాదనలో ఖర్చులకు పోగా మిగిలిందే ఆదా చేస్తారు. అలాకాకుండా రాబడి-ఆదా-ఖర్చు విధానాన్ని పాటించండి. ఆ ప్రకారంగా రాబడిలోంచి పొదుపు సొమ్మును పక్కన పెట్టాక మిగిలిన మొత్తాన్నే ఖర్చు చేయండి. మీకు వచ్చే జీతాన్ని ఏఏ ఖర్చులకు వాడుతున్నారో లెక్క రాసుకోవాలి. తర్వాత అందులో అవసరమైనవి, అత్యవసరమైనవి, అనవసరమైనవి అంటూ ప్రాధాన్యం ప్రకారం విభజించాలి. అలాగే షాపింగ్ చేస్తున్నప్పుడు వాటి అవసరాల్ని బేరీజు వేసుకోవాలి. దీంతోపాటు మీకంటూ కొన్ని ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోండి. ఉదాహరణకు లాప్టాప్ ఫండ్, ఫోన్ ఫండ్, ట్రావెల్ ఫండ్, పిల్లల చదువుల ఫండ్, ఉద్యోగ విరమణ ఫండ్.. దేనికదే ముఖ్యమైంది. దేనికెంత కేటాయించాలో తీర్మానించుకోండి. ఆ తర్వాతే ఏ ఖర్చు అయినా. వీటన్నిటికంటే ముందు.. షాపింగ్ చేస్తున్న ప్రతిసారీ.. ‘ఇప్పుడు షాపింగ్ అవసరమా? నిజంగా ఇంత డబ్బు పెట్టి కొనాలా?’ అన్న ప్రశ్న మనకు మనం వేసుకోవాలి. దీనివల్ల షాపింగ్ వ్యయం కచ్చితంగా నియంత్రణలోకి వస్తుంది.
-దీప నిట్టల, చార్టర్డ్ వెల్త్ మేనేజర్ డైరెక్టర్, శ్రీమంత్రణ ఫైనాన్షియల్ సర్వీసెస్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
పిల్లలు పుట్టాక నేను జాబ్ మానేసినా సమస్యలు రావద్దంటే ఏం చేయాలి?
ఇంట్లో ఉండాలని లేదు.. హాస్టల్లో చేరతానంటే ఒప్పుకోవట్లేదు.. 16 ఏండ్ల అమ్మాయి ఆవేదన
Sankranti special | పండుగ అయినా పేరంటాలైనా లంగావోణిదే హవా
Pre eclampsia | గర్భిణుల్లో ఈ సమస్య అంత ప్రాణాంతకమా? దీని నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?